twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ హిట్ కు సీక్వెల్‌ ..హీరో నే ఖరారు చేసారు

    By Srikanya
    |

    లాస్ ఏంజిల్స్ : సీక్వెల్స్ సీజన్ నడుస్తోంది. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా పాత సినిమాలన్నిటికి సీక్వెల్స్ రెడీ చేసి పారేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగానే హీరోనే వెళ్లడించారు. ఇంతకీ ఏమిటా సినిమా...అంటే...

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ ప్రధాన పాత్రలో 1988లో వచ్చిన చిత్రం 'ట్విన్స్‌'. హాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన చిత్రమిది. ఈ సినిమాకు కొనసాగింపుగా 'ట్విన్స్‌ 2' తీయడానికి రంగం సిద్ధమవుతోంది.

    గత కొంతకాలంగా ఆర్నాల్డ్‌ రాజకీయాలకు దూరమైనప్పటి నుంచి ఈ సీక్వెల్‌ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆర్నాల్డ్‌ 'ట్విన్స్‌ 2' గురించి ప్రస్తావించాడు.

    ఇందులోనూ ఆర్నాల్డ్‌, డానీ డెవిటో అన్నదమ్ములుగా నటిస్తుండగా మరో తమ్ముడిగా ఎడ్డీ మర్ఫీ నటిస్తాడు. త్వరలో ప్రారంభంకానున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియడం లేదు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ఇవాన్‌ రెయిట్‌మేన్‌ కొనసాగుతారని సమాచారం.

    Arnold Schwarzenegger-hollywood

    ఆర్నాల్డ్‌ తాజా చిత్రం 'టెర్మినేటర్‌ జెనిసిస్‌' విషయానికి వస్తే...

    హాలీవుడ్‌ చరిత్రలో 'టెర్మినేటర్‌' చిత్రంతో ప్రత్యేక అధ్యాయం. మన దేశంలో కూడా అది చిన్న చిన్న టౌన్ లో కూడా వంద రోజులుఆడి రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో టెర్మనేటర్..విన్యాసాలకు ,గ్రాఫిక్స్ కు అందరూ అబ్బురు పడి చూసేవారు. అంతేకాదు...ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టిన చిత్రం అది. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో వచ్చిన నాలుగు చిత్రాలూ ఘనవిజయం సాధించాయి.

    ఇప్పుడు 'టెర్మినేటర్‌ జెనిసిస్‌' పేరుతో మరో సీక్వెల్‌ సిద్ధమవుతోంది. రీసెంట్ గా దానికి సంబంధించిన పోస్టర్‌ను హీరో ఆర్నాల్డ్‌ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ కి విశేషాదారణ వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మంటల్లో కాలిపోతున్న ఆర్నాల్డ్‌ (రోబో)తో పాటు ఇతర తారాగణం ఉన్న ఆ పోస్టరు ఆసక్తి రేకెత్తిస్తోంది. అలన్‌ టైలర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జులై 1న విడుదల కానుంది.

    ‘టెర్రినేటర్ జీనిసిస్' సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదల కాగా...తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదల చేసారు. మొదటి ట్రలైర్ తో పాటు తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే మరోసారి ఈ టెర్మినేటర్ ప్రపంచ సినీ అభిమానులను మెప్పించబోతున్నాడని స్పష్టమవుతోంది. 170 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఈ చిత్రంలో ఇంకా ఎమిలి క్లార్క్, జాసన్ క్లార్క్, జాయ్ కోర్ట్నెనీ, మాట్ స్మిత్, లీ బైంగ్, డాయో ఒకెనియి, కోర్ట్నెనీ బి.వాన్స్, సాన్‌డ్రైన్ హోల్ట్, జెకె.సిమన్స్, డగ్లస్ స్మిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డేవిడ్ ఎలిసన్, డనా గోల్డ్ బెర్గ్ నిర్మాతలు. పారామౌంట్ పిక్చర్స్ వారు ఈచిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

    English summary
    Hollywood star Arnold Schwarzenegger has confirmed that a sequel to the 1988 comedy film Twins is on the cards with Danny DeVito and Eddie Murphy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X