తల్లి కాబోతున్న ఆర్నాల్డ్ కూతురు.. తాత కాబోతున్న సంతోషంలో..
హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ స్వార్జ్‌నెగర్ ఆనందానికి పట్ట పగ్గాలేకుండా ఉంది. ఆయన సంతోషానికి అసలు కారణమేమిటంటే.. ఆర్నాల్డ్ ఇంటిలోకి ఓ చిన్నారి అడుగుపెట్టబోతున్నది. తన కూతురు క్యాథరీన్ స్వార్జ్‌నెగర్ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించి తన ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ వార్త గురించి ఆర్నాల్డ్ వెల్లడిస్తూ..

తన కూతురు జన్మనివ్వబోతున్నట్టు
అమెరికాలో ప్రేక్షకాదరణ పొందిన ది టునైట్ షోలో ఆర్నాల్డ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కూతురు, క్యాథరీన్, అల్లుడు క్రిస్ ప్రాట్ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ వార్త మా ఇంటిలో ఆనందం కలిగించింది. మా ఇంటిలోకి మూడో తరం కూడా రాబోతున్నందుకు ఆనందంగా ఉంది అంటూ హోస్ట్ జిమ్మీ ఫాలెన్‌తో చెప్పారు.

చిన్నారి ఎత్తుకొని ముద్దాడాలని
నా కూతురు ఎప్పుడు చిన్నారికి జన్మినిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. నాకు మనవడో, మనవరాలిని ఇస్తే ఎత్తుకొని ముద్దాడాలని ఎదురు చూస్తున్నాను అని ఆర్నాల్డ్ తెలిపారు. అయితే తన కూతురు ప్రెగ్నెంట్ అని తెలుసు. ఇంకా పూర్తి వివరాలు నాకు తెలియవు. ఈ వేసవిలో క్యాథరీన్ డెలివరీ ఉంటుందోమో అని చెప్పారు.

ఎవరి లక్షణాలు వస్తాయో..
తాత కాబోతున్నాననే ఫీలింగ్ కొత్త అనుభూతిని కలిగిస్తున్నది. అయితే క్యాథరీన్, ప్రాట్ లక్షణాలు వస్తాయా? లేక తాత ఆర్నాల్డ్ వస్తాయా అనే విషయం ఆసక్తిగా ఉంది. మా ముగ్గురిలో ఎవరి రూపు రేఖలు, లక్షణాలు వస్తాయో వేచి చూడాల్సిందే అని ఆర్నాల్డ్ పేర్కొన్నారు.

తాత అయ్యే క్షణాల కోసం ఆర్నాల్డ్
ఇక ఆర్మాల్డ్ కూతురు క్యాథరీన్ ఏప్రిల్ మాసంలో గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవలే క్యాథరీన్ తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న కొద్ది రోజులకే ఈ శుభవార్త తెలియడంతో ఇరు కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. ఏది ఏమైనా ఆర్నాల్డ్ తాత అయ్యే క్షణాల కోసం ఎదురు చూడటం ముచ్చటేస్తున్నది.


Click it and Unblock the Notifications











