Arnold Schwarzenegger కారు యాక్సిడెంట్ వివాదంలో హాలీవుడ్ స్టార్.. మహిళను హాస్పిటల్‌కు తరలింపు
టెర్మినేటర్, టోటల్ రీకాల్, ట్రూ లైస్, కోనన్ ది బార్బేరియన్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను తన యాక్షన్, స్టంట్స్‌తో ఊర్రూతలూగించిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్. ప్రపంచ బాడీ బిల్డర్ టైటిల్‌తో ప్రేక్షకులకు చేరువైన ఆయన అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరుఫున కాలిఫోర్నియా స్టేట్‌కు గవర్నర్‌గా కూడా వ్యవహరించడం తెలిసిందే. అయితే అలాంటి స్టార్ హీరో ఆర్నాల్డ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కారు యాక్సిడెంట్ నుంచి తృటిలో తప్పిచుకోవడం అభిమానులకు ఊరట కలిగించింది. ఈ యాక్సిడెంట్ వివరాల్లోకి వెళితే..
ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్ అమెరికాలోని బ్రెంట్‌వుడ్‌లో ఓ కారు ప్రమాదం ఘటనలో ఇరుక్కుపోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదం నుంచి ఆయన తప్పించుకోగా, ఓ మహిళ గాయపడింది. గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం రివేరా కౌంటీ క్లబ్ వద్ద అలెన్‌ఫోర్డ్, సన్‌సెట్ బౌలేవార్డ్ వద్ద చోటుచేసుకొన్నది.

అయితే ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్ మద్యం లేదా డ్రగ్స్ తీసుకొని కారు నడుపుతున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నది. అయితే ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోకుండా కారు డ్రైవ్ చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారంలో తేలిందని లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
కారు ప్రమాదంపై ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్ హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. కారు ప్రమాదం జరిగిన సంగతి నిజమే. ప్రమాదం జరిగిన సమయంలో తానే స్వయంగా వాహనం నడుతునున్నట్టు ధృవీకరించారు.


Click it and Unblock the Notifications











