For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకింగ్ ఇన్సిడెంట్: అభిమానుల ముందే స్టార్ హీరోను ఎగిరి తన్నాడు!

|

హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గెర్... ఈ పేరు తెలియని సినీ అభిమాని ఈ ప్రపంచంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. తన యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న ఆర్నాల్డ్‌కు దక్షిణాఫ్రికాలోని జొహెనెస్‌బర్గ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తి అతడిని వెనక నుంచి ఎగిరి తన్నాడు.

జొహానెస్‌బర్గ్‌లోని సాండ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఆర్నాల్డ్‌ 'క్లాసిక్‌ ఆఫ్రికా' పేరుతో ఓ స్పోర్ట్స్ ఈవెంట్ హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన అభిమానులతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి గాల్లో ఎగిరి ఆర్నాల్డ్ వెనకవైపు నుంచి బలంగా తన్నాడు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి.

ఊహించని ఇన్సిడెంటుతో అంతా షాక్

ఊహించని ఇన్సిడెంటుతో అక్కడ ఉన్న ఆర్నాల్డ్ అభిమానులతో పాటు ఆయన భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిన అక్కడి నుంచి పక్కకు లాక్కెల్లారు. అయితే అతడు ఎందుకు ఇలా చేశాడు? ఆర్నాల్డ్ లాంటి వరల్డ్ స్టార్ మీద కోపం పెంచుకోవడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది.

ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గెర్ రియాక్షన్

ఈ సంఘటనపై ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గర్ రియాక్ట్ అయ్యారు. నన్న ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చిన తన్నిన విషయం వీడియో చూసే వరకు నమ్మలేదు. ఆ ఇడియన్ నా స్నాప్ చాట్ వీడియోకు ఆటంకం కలిగించనుందుకు సంతోషంగా ఉంది అని ఆర్నాల్డ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఫేమస్ అవ్వడానికే, షేర్ చేయవద్దంటున్న ఆర్నాల్డ్

కొందరు పాపులారిటీ కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. ఎవరూ ఆ వీడియోను షేర్ చేయవద్దు. దానికి బద్దలు ఆర్నాల్డ్ స్పోర్ట్స్‌కు సంబంధించిన అథ్లెల్స్ వీడియోలను షేర్ చేయండి. ఇక్కడ యంగ్ బాయ్ తన ఫిట్‌నెస్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వారికి పాపులారిటీ కల్పించండి, నా స్నాప్‌చాట్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయని ఆర్నాల్డ్ చెప్పుకొచ్చారు.

ఆర్నాల్డ్ స్పోర్ట్స్

ఆర్నాల్డ్ స్పోర్ట్స్ పేరుతో ఈ హాలీవుడ్ స్టార్ క్లబ్ నిర్వహిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, స్పెయిన్లో వీటి శాఖలు ఉన్నాయి. ఇందులో 90 రకాల క్రీడల్లో అన్ని వయసుల వారు కలిపి 24 వేల అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు. దీనికి ప్రమోషన్ కల్పించడంలో భాగంగా ఇక్కడ నిర్వహించిన స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆర్నాల్డ్ సౌతాఫ్రికా వచ్చారు.

వైరల్ అవుతున్న వీడియో

ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గెర్‌ను గుర్తు తెలియని వ్యక్తి తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దీన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ‘టెర్మినేటర్‌' సిరీస్ యాక్షన్ సినిమాలతో పాటు అనేక హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆర్నాల్డ్ వయసు ప్రస్తుతం 71 సంవత్సారాలు.

English summary
Hollywood star Arnold Schwarzenegger was attacked on Saturday by a man who kicked him in the back at a sports event in South Africa. "I thought I was just jostled by the crowd, which happens a lot. I only realized I was kicked when I saw the video like all of you. I'm just glad the idiot didn't interrupt my Snapchat."Arnold tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more