Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వారెవ్వా!.. తండ్రికి తగ్గ తనయుడు.. అచ్చు మిస్టర్ వరల్డ్ ఐకానిక్ ఫోజ్.. ఎవరో గుర్తుపట్టండి..
జీవితంలో ఎవరైనా, ఏ విషయంలోనైనా మొట్టమొదటగా స్పూర్తి పొందేది తండ్రి నుంచే. తండ్రి ఆలోచనలు, అలవాట్లు బిడ్డలకు చాలా తొందరగా ఒంటపడుతాయి. ఇక సినీ తారల పిల్లల విషయాలను చూసుకొంటే ఏ సినీ పరిశ్రమలోనైనా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తుంటారు. వారసత్వమే వారికి ఊపిరిగా నిలుస్తుంది. అదే విషయం హాలీవుడ్ హీరో విషయంలో తన తనయుడు పక్కాగా అనుకరించి ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు. ప్రస్తుతం హీరో కొడుకు సాధించిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫోటో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది.
తండ్రిని అనుకరించే తనయులు
ఇక హాలీవుడ్ ప్రస్తావనకు వస్తే.. టెర్మినేటర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన మొదట తన బాడీ బిల్డింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకొన్నారు. మిస్టర్ వరల్డ్ టైటిల్‌ను సాధించి ఆ తర్వాత హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. టర్మినేటర్ తర్వాత ఆయన కథ అందరికీ తెలిసిందే.
మిస్టర్ వరల్డ్ టైటిల్‌తో
ఇక ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాలేదు. రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు. 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా స్టేట్‌కు గవర్నర్‌గా పనిచేశారు. ఇప్పుడు సినిమాలు, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తనయుడు జోసెఫ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు.
|
తండ్రిని అనుకరిస్తూ ఐకానిక్ ఫోజ్
లాక్డౌన్ సమయంలో ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ తనయుడు జోసెఫ్ బేనా కండలు తిరిగిన ఓ ఫోటోను పోస్టు చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చు తండ్రి మాదిరిగానే ఫోటోకు ఫోజు ఇచ్చి.. ఐకానిక్ ఫోజుకు ఇది పర్ఫెక్ట్ సమయం అంటూ కాప్ఫన్ పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటో మీడియాలో వైరల్ అవుతున్నది.
డిగ్రీ పూర్తి చేసుకొన్న ఆర్నాల్డ్ తనయుడు
కాగా, జోసెఫ్ బేనా బిజినెస్ రంగంలో పట్టబద్రుడయ్యాడు. పెప్పెర్డైన్ కాలేజీ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని అర్నాల్డ్ ఓ సందేశాన్ని ఇటీవల పోస్టు చేశారు. కంగ్రాట్స్ జోసెఫ్. నాలుగేళ్ల శ్రమకు నీకు ఫలితం దక్కింది అంటూ తన పోస్టులో పుత్సోత్సావాన్ని చూపించారు.
Recommended Video
తండ్రిని అనుకరించే తనయులు
బాలీవుడ్ విషయానికి వస్తే.. తండ్రి బాటలో ప్రయాణిస్తున్న హీరోలు ఎందరో ఉన్నారు. వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్ లాంటి వారిని పక్కనపెడితే.. ఇటీవల కాలంలో తన దేహదారుడ్యంతో ఆకట్టుకొంటున్న హీరోల్లో టైగర్ ష్రాఫ్ ఒకరు. కేవలం బాడీ బిల్డింగ్‌లోనే కాదు.. ఫైట్స్, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఆల్ రౌండర్‌గా మారారు.