భార్యను వదిలేసి మోడల్ తో డేటింగ్ చేస్తున్న ఇండియన్ టెక్స్ టైల్ దిగ్గజం
ఎలిజబెత్ హార్లే ముద్దుల మొగుడు అరుణ్ నాయర్ కొత్త మోడల్ తో డేటింగ్ చేస్తున్నాడని సమాచారం. ఐతే ఈముద్దుగుమ్మ మాత్రం ఎలిజబెత్ హార్లే కంటే ఇరవై సంవత్సరాలు చిన్నదంట. కిమ్ జాన్సన్ చూడడానికి చాలా అందంగా అమాయకంగా కనిపిస్తూ అచ్చం ఎలిజబెత్ హార్లే లాగే ఉంటుందని పలువురు చెప్తున్నారు. ఇంతకీ ఎవరీ అరుణ్ నాయర్ అని అనుకుంటున్నారా..
ఇండియన్ టెక్స్ టైల్ దిగ్గజం అరుణ్ నాయర్ పేరు విననివారుండరంటే నమ్మండి. తన భార్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత అరుణ్ నాయర్ కిమ్ జాన్సన్ తో సంబంధం కోనసాగిస్తున్నారని వినికిడి. ఇది మాత్రమే కాకుండా వెస్ట్ లండన్ లోని కెనిసగ్టంన్ లోని లగ్జరీ అపార్ట్ మెంట్ లో ఇద్దరూ కలసి మూడు రాత్రులు గడిపారని, ఇందులో భాగంగా వీరిద్దరి మద్య ముద్దులు పర్వం కోనసాగిందని అంటున్నారు.
ఇక ఎలిజబెత్ హార్లే విషయానికి వస్తే తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ తోటి డేటింగ్ చేస్తున్నట్లు గతంలో కోన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











