twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్ బాండ్ గర్ల్ పాత్రంటే నాకు చాలా ఇష్టం

    By Nageswara Rao
    |

    'ఆష్లే గ్రీన్' అమెరికా స్టార్ మోడల్, హీరోయిన్. ట్విలైట్ నవలలో ఈమె పోషించిన అలైస్ కూల్లెన్ పాత్రతో యావత్ హాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దొచుకుంది. హాలీవుడ్‌కి వచ్చిన అనతి కాలంలోనే అందరి మనసులను దొచుకొవడమే కాకుండా తన కంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తన ఇష్టాఇష్టాలను పంచుకున్నారు.

    ఈ సందర్బంలో ఆష్లే గ్రీన్ మాట్లాడుతూ నాకు బాండ్ గర్ల్ పాత్ర అంటే చాలా ఇష్టం. సాధారణంగా బాండ్ సినిమాలలో జేమ్స్ బాండ్ చేసేటటువంటి యాక్షన్ సీన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం నేను ట్విలైట్ సిరిస్ తరహా ఎసిసోడ్స్ ఎప్పుడైనా వచ్చేవేనని అన్నారు. ఎందుకంటే ట్విలైట్ సిరిస్‌లలో నటించే క్యారెక్టర్ కూల్‌గా అలా సాగిపోతుంది కాబట్టి.

    జేమ్స్ బాండ్ ప్రక్కన బాండ్ గర్ల్‌గా ఒక్కసారైన నటించాలనేది నా కోరికని తెలిపారు. ప్రస్తుతం హాలీవు్డ్లో జేమ్స్ బాండ్‌గా డేనియల్ గ్రేగ్ హీరోగా 23వ జేమ్స్ బాండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని ఎమ్‌జిఎమ్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈసినిమాని ఆస్కార్ అవార్డ్ విన్నర్, టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మాజీ భర్త శ్యామ్ మెండిస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జేమ్స్ బాండ్ గర్ల్స్‌గా హెలెన్ మేక్కోరీ, ప్రెంచ్ బ్యూటీ బెరనైస్ మార్లోహీ నటిస్తున్నారు. విలన్‌గా ఆస్కార్ విన్నర్ జేవియర్ బార్డిమ్ నటిస్తున్నారు.

    English summary
    Actress Ashley Greene wants to be the next Bond girl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X