మెడపై కత్తిపెట్టి కిడ్నాప్.. దారుణంగా రేప్ చేశాడు.. చంపడానికి ప్రయత్నం
హాలీవుడ్‌లో ప్రముఖ రియాలిటీ షో స్టార్ ఆష్లే మార్ట్సన్ తనపై 2009లో జరిగిన లైంగిక దాడిపై నోరు విప్పింది. తన బాధను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన లేఖను రాశారు. దాదాపు పదేళ్ల క్రితం జరిగిన చేదు అనుభవాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా వివరించారు. తన బాధను మరో విధంగా మీడియా కథనాలు రాకూడదనే తాను ఆ విషయాన్ని బయటపెట్టానని చెప్పింది. వివరాల్లోకి వెళితే..

19 ఏళ్ల వయసులో
అప్పుడు నాకు 19 ఏళ్లు. ఓ అగంతకుడు నన్ను కిడ్నాప్ చేశాడు. ఎత్తుకెళ్లి నాపై లైంగిక దాడి (రేప్) చేశాడు. లైంగికదాడితో నేను చచ్చిపోయాననే అనుకొన్నాను అని ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నది. నేను పడిన బాధను నా మిత్రుడోకరు వివరంగా రాసి మీడియాకు పంపారు అని యాష్లే వివరించారు

నా మిత్రుడే సంఘటన గురించి
నాకు సంబంధించిన లైంగిక దాడి ఘటన సమాచారాన్ని లీక్ చేయలేదు. మీడియా మరో విధంగా కథనాలు వెల్లడించకూడదనే ఉద్దేశంతో నా మిత్రుడు ఆ ఘటన గురించి రాసి పంపారు. ప్రస్తుతం ఆ ఘటన గురించి మాట్లాడమని చాలా మంది ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ నేను మాట్లాడితే దానిని ఎలా ప్రచురిస్తారో అనే బాధ ఉంది అని చెప్పారు.

దాడి జరిగింది ఇలా
యాష్లే మార్ట్సన్‌పై జరిగిన దాడి ఘటన గురించి ఓ వెబ్‌సైట్ తన కథనాన్ని వెల్లడించింది. ఫిలడెల్ఫియాకు చెందని సీన్ పాట్రిక్ అనే వ్యక్తి యాష్లేపై దాడి చేశాడు. గతంలో కూడా ఓ మహిళను కిడ్నాప్ చేసి లైంగిక దాడి జరిపిన కేసులో శిక్షను అనుభవించాడు. మార్ట్సన్ మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వమని ముందు హెచ్చరించాడు అని కథనంలో తెలిపింది.

చంపేస్తానని బెదిరించాడు
మార్ట్సన్ చేతులను తాడు కట్టివేసి కిడ్నాప్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని భయపెట్టారు. తాడుతో గట్టిగా కట్టడం వల్ల చేతులు చచ్చుపడినంత పనైంది అని ఓ పత్రిక తన కథనంలో వెల్లడించింది. దారుణమైన అనుభవాన్ని చవిచూసిన మార్ట్సన్‌కు అన్ని వర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతున్నది.

నీపై సానుభూతి ఉంది
మార్ట్సన్ జరిగిన అన్యాయంపై తన కాబోయే భర్త స్పందించారు. ఇలాంటి వంచనకు గురైన నీపై నా సానుభూతి ఉంది. అలాంటి చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నీ గురించి పూర్తిగా తెలిసిన వాడిగా పరిస్థితిని అర్ధం చేసుకోగలను. నీవు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అని కాబోయే భర్త జే స్మిత్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











