బికినీలో పుట్టినరోజు సంబరాలు చేసుకున్న హీరోయిన్
హై స్కూల్ మ్యూజికల్ స్టార్స్ ఆస్లే టిస్‌డేల్, జాక్ ఎప్రాన్ మేమిద్దరం ఎల్లప్పుడూ మంచి స్నేహితులమేనంటూ కానిచ్చేయాల్సినవన్ని కానిచ్చేస్తున్నారు. శనివారం మాలిబు బీచ్‌లో ఆస్లే టిస్‌డేల్ 26వ పుట్టినరోజు జాక్ ఎప్రాన్ గెస్టుగా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించారు. ఆ రోజు పుట్టినరోజు పాపాయి అయిన టిస్‌డేల్‌ని జాక్ ఎఫ్రాన్ తన భుజాలపై ఎత్తుకోని బీజ్ చుట్టూ తిరుగుతూ తన స్నేహితురాలికి మంచి సర్‌ప్రైజ్‌ని ఇచ్చాడు. దాంతో మంత్ర ముగ్దురాలైన టిస్‌డేల్ తన ట్విట్టర్‌లో నా ప్రాణ స్నేహితుడు జాక్ ఎఫ్రాన్ సమక్షంలో నా పుట్టినరోజు ఇంత బ్రహ్మాండంగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. జాక్ ఎఫ్రాన్ నాకు మంచి స్నేహితుడే కాదు నా సొంత బ్రదర్ లాంటి వాడని అక్కడున్న వారందరిని కంగు తినిపించింది.
ఈ పుట్టినరోజు ఫంక్షన్ రోజుని చూసినటువంటి ప్రతి ఒక్కరూ జాక్ ఎఫ్రాన్, టిస్‌డేల్ మద్య ఏ సంబంధం లేదు అంటే నమ్మడం లేదు. అందుకు కారణం ఈ పార్టీలో అతను ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్య పరచింది. ఐతే టిస్‌డేల్ మాత్రం జాక్ ఎప్రాన్ నేను మంచి స్నేహితులం అంటూ బుకాఇస్తుంది. పార్టీలో కనిపిస్తున్నటువంటి అన్ని పిక్చర్స్‌ని చూసి అందరూ భ్రమపడుతున్నారు. మా ఇద్దరి మద్య అటువంటి సంబంధం ఏమీ లేదు. నేను నా పుట్టినరోజు ఫంక్షన్‌ని స్నేహితులు, మా కుటుంబ సభ్యులు, నా బాయ్ ప్రెండ్ స్కాట్ మద్యలో జరుపుకున్నానని ఈరోజు ఉదయం ట్వీట్ చేసింది.
ఇక ఈ పుట్టినరోజు ఫంక్షన్ అంతా మాలిబు లోని ఓ ప్రయివేటు బీచ్ రిసార్ట్‌లో జరిగింది. టిస్‌డేల్ పుట్టినరోజు మొత్తాన్ని బికినీలోనే జరుపుకుంది. బికినీలో ఉండగానే తన స్నేహితుడు అని చెప్తున్న జాక్ ఎప్రాన్ టిస్‌డేల్‌ని ఎత్తుకోని బీచ్ రిసార్ట్ మొత్తం ఊరేగింపు తీసుకోని వెళ్శినట్లు తీసుకోని వెళ్శి బీచ్ మొత్తం తిప్పాడు. వీరిద్దరూ ఇలా విహారిస్తుండగా టిస్‌డేల్ బాయ్ ప్రెండ్ వీరిద్దరూ చేసేటటువంటి చేష్టలను కెమెరాలో బంధించాడు.


Click it and Unblock the Notifications











