ఎంతో మందిని రేప్ చేశాడు: ‘ఫిల్మ్ ఇండస్ట్రీ’ ఆతడి దుర్మార్గాలను కప్పిపుచ్చుతోంది!

By Bojja Kumar

హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టెన్ వ్యవహారం పెద్ద సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి ఎంతో మంది నటీమణులను తన కామదాహానికి బలి చేసిన ఈ దుర్మార్గుడి వ్యవహారాన్ని హాలీవుడ్లోని ప్రముఖ నటీమణులంతా కలిసి బట్టబయలు చేసి సంచలనానికి తెరలేపారు. హార్వీ వెయిన్‌స్టన్ వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశం అయింది. ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ పాతుకుపోయిన హార్వీ వెయిన్‌స్టెన్ లాంటి కామాంధులు గురించి చర్చ మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇటాలియన్‌ నటి ఏసియా అర్గెంటో మరోసారి హార్వీ వెయిన్‌స్టన్ ప్రస్తావన తెచ్చారు.

ఏసియా అర్గెంటో

ఏసియా అర్గెంటో

హార్వీ వెయిన్‌స్టన్ దుర్మార్గాలు బయటపెట్టిన ప్రముఖ నటీమణుల్లో ఇటాలియన్‌ నటి ఏసియా అర్గెంటో ఒకరు. తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫోస్టివల్‌కు హాజరైన ఆమె వెయిన్‌స్టన్ దుర్మార్గాలను గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన తాను.... హార్వీ వెయిన్‌స్టన్ కామదాహానికి బలైనట్లు వెల్లడించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ అతడి దుర్మార్గాలను కప్పి పుచ్చుతోంది

ఫిల్మ్ ఇండస్ట్రీ అతడి దుర్మార్గాలను కప్పి పుచ్చుతోంది

సినిమా ఇండస్ట్రీ హార్వీ వెయిన్‌స్టన్ దుర్మార్గాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని ఈ సందర్భంగా ఏసియా అర్గెంటో మండి పడ్డారు. ఇలాంటి వారి దుర్మార్గాలను కవర్‌అప్ చేయడానికి ప్రయత్నించడం దారుణం అన్నారు.

ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు

ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు

కేన్స్‌ వేదికగా హార్వీ వెయిన్‌స్టన్ ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు. 21 ఏళ్ల క్రితం నా వయసు 21 సంవత్సరాలు ఉన్నపుడు ఇదే కేన్స్‌ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్‌స్టీన్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని ఏసియా అర్గెంటో గుర్తు చేసుకున్నారు.

పార్టీ అని పిలిచి రేప్ చేశాడు

పార్టీ అని పిలిచి రేప్ చేశాడు

అప్పట్లో నేను నటించిన చిత్రానికి వెయిన్‌స్టీన్‌ డిస్ట్రిబ్యూటర్‌. చిత్ర బృందానికి పార్టీ ఇస్తున్నట్లు చెప్పి హోటల్‌‌కు పిలిచాడు. నేను అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ పార్టీ లాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. హోటల్‌ గదిలో వెయిన్‌స్టీన్‌ ఒక్కడే ఉన్నాడు. నేను తిరిగి వెళ్లిపోతుంటే నాపై బలాత్కారం చేశాడు అని ఏసియా అర్గెంటో తెలిపారు.

నాలాంటి బాధితులు ఎంతో మంది

నాలాంటి బాధితులు ఎంతో మంది

ఆ సంఘటన తర్వాత నా లాంటి బాధితులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారని తెలిసింది. ఇపుడు సినీ పరిశ్రమకు హార్వీ వెయిన్‌స్టన్ పీడ వదిలింది. ఇలాంటి వారు ఇండస్ట్రీలో ఇక ఉండరని భావిస్తున్నాను. ఒక వేళ ఉన్నా అవకాశాల కోసం ఎవరూ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో కెరీర్లో ఎదగడానికి ప్రయత్నించండి అని ఆమె సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X