నాకు 'డూపా' నో వే.. నేనే చేస్తా సాహాసాలు
హాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్ సంపాదించుకోవటమే కాకుండా, ఆ పలుకుబడితో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా ఎన్నికయిన హాలీవుడ్ యాక్షన్ హిరో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తను ప్రస్తుతం నటిస్తున్న 'లాస్ట్ స్టాండ్' సినిమాలో స్టంట్స్ మ్యాన్‌ని పెట్టుకొవడానికి నిరాకరించారు. అంతేకాకుండా తాను చేయాల్సిన స్టంట్స్ వేరే ఎవరో చేయడం ఏంటనీ అన్నారు.
ఇక వివరాల్లోకి వెళితే 64 సంవత్సరాలు వయసు కలిగిన ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ గత రెండు నెలలుగా న్యూ మెక్సికోలో జరుగుతున్న 'లాస్ట్ స్టాండ్' సినిమాలో స్టంట్స్‌కు గాను ప్రోడ్యూసర్స్ స్టంట్స్ మ్యాన్‌ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పగా, అందుకు తనదైన శైలిలో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ నిరాకరించారు. ఈ సందర్బంలో ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మాట్లాడుతూ స్టంట్స్ మ్యాన్ చేసేటటువంటి డేంజరస్ సీన్లు నేను కూడా చేయగలను, సినిమాకు కొన్ని సీన్లు ప్రాణం అనుకుంటే నేనే చేస్తాను. ఎందుకంటే కొన్ని సీన్లను అతని కంటే నేనే బాగా జడ్జ్ చేయగలుగుతానని తెలిపారు.
గతంలో కూడా ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ చాలా సినిమాలలో రిస్క్ సీన్లను చేశారు. 'లాస్ట్ స్టాండ్' సినిమాలో ఓక సీన్‌లో హీరో చేసేటటువంటి డ్రైవింగ్ సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉండనున్నాయని సమచారం. ఈ ఒళ్లు గగుర్పొడిచే సీన్లు కొసమే స్టంట్స్ మ్యాన్‌ని ప్రోడ్యూసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











