హలీవుడ్ సూపర్‌స్టార్ అర్నాల్డ్‌పై దాడి.. వెనుక నుంచి వేగంగా వచ్చి...
హాలీవుడ్ స్టార్, మాజీ కాలిఫోర్నియా గవర్నర్ అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సౌతాఫ్రికాలో ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఓ వ్యక్తి వెనక నుంచి వేగంగా వచ్చి కిక్ ఇచ్చాడు. ఆ దాడితో తూలిపడబోయి తమాయించుకొన్నాడు. ఆ దాడి ఘటన అనంతరం అర్నాల్డ్ వివరణ ఇవ్వడంతో అభిమానులు ఆందోళనకు తెరపడింది.
సౌతాఫ్రికాలోని జహన్నెస్ బర్గ్‌లో బాడీ బిల్డింగ్, ఇతర క్రీడలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా ఫ్యాన్స్‌ను ముచ్చటిస్తున్నారు. అంతలోనే వెనకు నుంచి వచ్చిన ఓ వ్యక్తి.. అర్నాల్డ్ వీపులో ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు. వెంటనే అంగతకుడిని అర్నాల్డ్ బాడీగార్డ్స్ అదుపులోకి తీసుకొన్నాడు.

తనపై దాడి అనంతరం అర్నాల్డ్ స్పందించాడు. దాడి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు ఏమీ కాలేదు. గుంపులో నుంచి ఎవరో వచ్చి నన్ను బలంగా తాకారని అనుకొన్నాను. కానీ వీడియో చూసిన తర్వాతే మీ అందరి లాగా నాకు కూడా కిక్ అని తెలిసింది. ఆ ఇడియెట్ చేసిన పని వల్ల నా సంభాషణ ఆగలేదు అని అర్నాల్డ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అర్నాల్డ్‌ను వెనుక నుంచి గట్టిగా తన్నినా.. ముందుకు పడిపోకుండా బలంగా నిలబడి ఉడటం వీడియోలో కనిపించింది. ఆ దాడిని ఆర్నాల్డ్ చాలా తేలికగా తీసుకోవడం కనిపించింది. దాడి అనంతరం ఆ వీడియోను కూడా అర్నాల్డ్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.


Click it and Unblock the Notifications











