'అతడు పోతే నాకేంటి' అంటున్న తార...
ఆండ్రినా ప్రెట్ రిట్జ్ ప్రస్తుతం ఒంటరిగా వుంటూ చాలా సంతోషంగా వుందట. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంకొకరు తన్నుకుపోయినా వెంటనే తేరుకొని ఆనందంగా బ్రతికేస్తున్న ఆమె గుండె ధైర్యాన్ని ఆమె సన్నిహితులు మెచ్చుకోలేకుండా వుండలేకపోతున్నారు. అంతకీ అసలు విషయం ఏంటంటే ఆండ్రినా బాయ్ ఫ్రెండ్ కోరిబోహెన్ ను క్రిస్టినా ఎరవేసి తనవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై తనకు ఎలాంటి బెంగాలేదంటోంది ఆండ్రినా. ఇతరుల ప్రియుల్ని ఆకట్టుకోవాలనుకోనే క్రిస్టినాను చూస్తుంటే తనకు ఏ మాత్రం కోపం లేదని చేప్పుకొచ్చింది.
కాగా ఇటీవల ఓ ప్రీమియర్ ఫంక్షన్ కు వెళ్లిన ఆండ్రినా స్నేహితులకు క్రిష్టినా తనూ, ఆండ్రినా బాయ్ ప్రెండ్ కోరిబోహెన్ ప్రేమించుకొంటున్నట్టు చెప్పిందట. దీంతో ఈ విషయాన్ని ఆమె స్నేహితులు ఆండ్రినా చెవినవేసారంట. మొదట సరదాగా తీసుకున్న ఆండ్రినా నిజంగానే తన ప్రియుడు క్రిస్టినా వైపు ఆకర్షితుడు అవడం చూసి ఆశ్చర్యపోయిందట. కానీ వెంటనే తేరుకొని సంతోషంగా వుంటోందట కూడా...దీంతో ఆమె ధైర్యానికి ఆమె స్నేహితులు మెచ్చుకొంటున్నారట. కానీ జీవితంలో ఇవన్నీ మామూలే అంటోంది ఆండ్రినా..


Click it and Unblock the Notifications











