ఆ సినిమా ఛాన్స్ నా అదృష్టం..
ఆస్ట్రియా మోడల్, డ్యాన్సర్ అయిన డానియేలా జాచ్రేల్ మల్లు వుడ్‌లో ఓ స్పెషల్ సినిమాలో నటించనుంది. ఆ సినిమా పేరు 'స్పానిష్ మసాలా'. ఈ సందర్బంలో డానియేలా జాచ్రేల్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉందని, అంతేకాకుండా కొంచెం, కొంచెం మళయాళం కూడా నేర్చుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాలో డానియేలా జాచ్రేల్ లీడ్ హీరోయిన్‌గా నటించగా, మళయాళం పాపులర్ హీరో దిలిప్ ఆమె సరసన నటించనున్నాడు.
ఈ సినిమాకి దర్శకత్వ భాద్యతలను లాల్ జోస్ వహిస్తున్నారు. ప్రస్తుతానికి తాను నాలుగు మళయాళం పదాలను నేర్చుకున్నానని అన్నారు. అవి ఏంటంటే వుమా(కిస్), మనస్తే, నమస్కారం, నంది. నిజంగా ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ సినిమాకి సంబంధించిన 90శాతం టాకీ భాగం స్పెయిన్‌లో తీయగా, మిగిలిన పది శాతం కేరళలో తీయడం జరుగుతుందని ఈ సినిమా దర్శకత్వ భాద్యతలను నిర్వర్తిస్తున్న లాల్ జోస్ తెలిపారు.


Click it and Unblock the Notifications











