అవతార్-2 ఆశక్తికర విశేషాలు
ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి రికార్డులు సృష్టించిన భారీ సైంటిఫిక్ సినిమా అవతార్ కు సీక్వెల్ తీసే పనిలో దర్శకనిర్మాత జేమ్స్ కామెరూన్ బిజీగా వున్నాడు. ఈ సినిమాను చిత్రీకరించే లొకేషన్ల కోసం ఆయన ప్రపంచ వ్యప్తంగా పర్యటిస్తున్నాడు. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం అవతార్-2 సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో జరగనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కామెరూనే వెళ్లడించాడు.
ఇక ఈ సినిమాలో కూడా శ్యామ్ వర్తింగ్టన్, జియో సల్దానాలే హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఇటీవలే ఇండియా వచ్చిన కామెరూన్ ఇక్కడి లొకేషన్ల మీద కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఎన్నో భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను 4డి లో రూపొందించాలని కామెరూన్ సన్నాహాలు చేస్తున్నాడట. అవతార్ తో 3డి పరిజ్ఞానానికి విసృత ప్రచారం కలిగించిన కామెరూన్ ఈ సినిమాతో 4డితో మాయచెయ్యాలని అనుకుంటున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











