Avatar 2 తొలి ప్రీమియర్ ఎక్కడ? జేమ్స్ కామెరాన్ ఎన్ని దేశాల్లో రిలీజ్ చేస్తున్నారంటే?
సినిమా ప్రపంచంలో 13 ఏళ్ల క్రితం సంచలన విజయం సాధించిన అవతార్ సినిమాకు కొనసాగింపుగా అవతార్ 2 చిత్రం రికార్డులు తిరగరాసేందుకు సిద్దమైంది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం సరికొత్త రికార్డులకు వేదికగా మారుతున్నది. అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుతంగా తెరకెకకించే ప్రయత్నం చేశారు. నీటి అడుగు భాగంగా భారీగా సన్నివేశాలను వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో షూట్ చేశారు.
అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నీటి అడుగు భాగంలో చిత్రీకరణ ఓ ఛాలెంజ్. అలాంటి చాలెంజ్‌కు జేమ్స్ కామెరాన్ సవాల్ విసిరారు. అయితే అవతార్ 2 చిత్రాన్ని డిసెంబర్ 16, 2022 తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు.

మే 6వ తేదీన ట్రైలర్
అవతార్ చిత్రాన్ని సుమారు 160కిపైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాను అత్యధిక భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ రేంజ్‌లో ఓ సినిమా రిలీజ్ కావడం సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషంగా మారింది. అలాగే ఈ సినిమా ట్రైలర్ మే 6వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

డిసెంబర్ 16న లాస్ వెగాస్‌లో
ఇదిలా ఉండగా, అవతార్ 2 చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ (ఫస్ట్ గ్లింప్స్)ను డిసెంబర్ 16న లాస్ వెగాస్‌లోని సినిమాకాన్ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. పాండమిక్ తర్వాత థియేటర్లలో ప్రేక్షకులకు మ్యాజిక్ అందించేందుకు దర్శకుడు జేమ్స్ కామెరాన్ సరికొత్త ప్లాన్స్‌తో ముందుకు వస్తున్నారు. ఈ వారం జరగబోయే ఓ ఈవెంట్ కోసం క్రిస్టీ, బార్కో థియేటర్లలో లేజర్ ప్రోజెక్టర్లను సిద్దం చేశారు.

సినిమాకాన్‌లో తొలి ప్రీమియర్
అవతార్ 2 మూవీకి సంబంధించి డిసెంబర్ 16న ప్రదర్శించే ప్రీమియర్ కోసం సినిమాకాన్ థియేటర్‌ను అత్యాధునిక సాంకేతికతతో సిద్దం చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ ఇమ్మెర్సివ్ సౌండ్, డాల్బీ విజన్ 4కే, లేజర్ సిస్టమ్ ద్వారా 3డీ ప్రోజెక్షన్ చేయనున్నారు. ఇందుకోసం వేలాది 3డీ గ్లాసులను సిద్దం చేశారు.

అవతార్ బడ్జెట్, కలెక్షన్లు
దర్శకుడు జేమ్స్ కామెరాన్ 2009లో అవతార్ చిత్రాన్ని 237 మిలియన్ డాలర్లతో రూపొందించారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.847 బిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది. అప్పట్లో ప్రపంచబాక్సాఫీస్ చరిత్రలోనే ఇవి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక అవతార్ 2 చిత్రం 250 మిలియన్ డాలర్ల వ్యయంతో తెరకెక్కించారు.

అవతార్ 3, 4, సీక్వెల్స్ ఎప్పుడంటే
ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను అవతార్ సీక్వెల్స్ కొత్త అనుభూతిని అందించేందుకు ముస్తాబవుతున్నాయి. అవతార్ 2 చిత్రం డిసెంబర్ 16న రిలీజ్ కానున్నది. అలాగే అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20, 2024లో విడుదల అవుతుంది. అవతార్ 4 చిత్రం డిసెంబర్ 18, 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028 రిలీజ్ ప్లాన్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











