twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డులు ఈ చిత్రాలకే...!!

    By Kuladeep
    |

    ప్రపంచ సినీవినీలాకాశంలో ఆస్కార్ అవార్డులకున్న ప్రత్యేకత మరే అవార్డులకూ లేదు. ఈ అవార్డు కోసం ఎన్నో చిత్రాలు పోటీపడతాయి. అవార్డులు సాధించిన వారు ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతారు. అవును మరి వారు సినిమా ప్రపంచాన్ని జయించారు. అంతటి ప్రాముఖ్యత గల ఈ అవార్డుల్లో ప్రతీ విభాగం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.

    కాగా వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విజువల్ ఎఫెక్టులకు సంబంధించిన అవార్డులు విభాగంలో ఇటీవలే విడుదలయిన, విడుదల కానున్న సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటి జాబితాను ఇటీవలే అకాడమీ అవార్డుల కమిటీ ప్రకటించింది. ఈ జాబితాలో ఈ నెల 18న విడుదల కానున్న 'అవతార్', ఇటీవలే విడుదలయిన '2012' లు చోటు సంపాదించుకున్నాయి. వీటితో పాటు 'ఎ క్రిస్ట్ మస్ కరోల్', 'వేర్ ద వైల్డ్ థింగ్స్ ఆర్', 'డిస్ర్టిక్ట్ 9', 'కరోలిన్', 'షెర్లాక్ హాల్మెస్', 'స్టార్ ట్రెక్', 'టర్మినేటర్ సాల్వేషన్', 'వాచ్ మెన్', 'హ్యారీ పోటర్' వంటి సినిమాలు స్థానం దక్కించుకున్నాయి.

    ఈ సినిమాల్లోంచి మూడు సినిమాలను ఎంపిక చేసి వాటికి ఆస్కార్ అవార్డుల నామినేషన్ ను ఇస్తారు. ఈ మూడు సినిమాల్లోంచి ఉత్తమ సినిమాను ఎంపిక చేసి అవార్డును అందజేస్తారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ అవార్డులను ప్రకటిస్తారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X