సరికొత్త అధ్యాయానికి రూపం ఇచ్చిన 'అవతార్'..!!

By Kuladeep

గత శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి వెండి తెర మీద అద్భుత లోకాన్ని ఆవిష్కరించిన సినిమా 'అవతార్'. టైటానికి వంటి ప్రేమకథను తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్, ప్రేమకథను మిలితం చేసిన సైన్స్ ఫిక్ మూవీగా విడుదలయి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో కనక వర్షాన్ని కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి సుమారు 300 మిలియన్ డాలర్లను వసూలు చేసి లాభాలను ఆర్జించే స్థాయికి చేరుకుంది.

కాగా ఈ సినిమా కథకమీషు భారతీయులకు బాగా దగ్గరగా వుంది. ఇలాంటి కథలు మనకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ కథను ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా వుండి అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందిచబడి వుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఈ సినిమా ఇక్కడ సరికొత్త రికార్డులను సృష్టించనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో ఈ సినిమా తొలి రోజు 6.75 కోట్లను వసూలు చేసిందంటే ఆ సినిమా ఏ రేంజిలో కలెక్షన్లు రాబడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కలెక్షన్లు కేవలం ఇంగ్లీషు వెర్షన్ సినిమావి మాత్రమే కావడంతో ప్రాంతీయ భాషల్లోకి అనువాదమయిన సినిమా కలెక్షన్లు మరింత ఎక్కువగా వుంటాయి అనడంలో సందేహం లేదు.

ట్రేడ్ వర్గాలు అంచనాలు నిజమయితే ఇప్పటి వరకూ భారతదేశంలో అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా అమీర్ ఖాన్ హిందీ సినిమా గజిని పేరిట వున్న రికార్డులను ఖచ్చితంగా ఈ సినిమా పడగొడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X