కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు... అరుదైన రికార్డు దిశగా 'అవతార్'..!!
ప్రస్తుతం ప్రపంచ సినీపరిశ్రమలో ఎక్కడ విన్నా వినిపిస్తున్న సినిమా పేరు 'అవతార్'. వెండి తెరపై అద్భుతంగా ఆవిశ్కరించబడిన పాండోరా అందాలు, చరిత్రలో ఇంత వరకూ కనీవినీ ఎరుగని రీతిలో రూపొందిన గ్రాఫిక్స్, పాత కథే అయినా కొత్తగా చెప్పిన తీరు, జేమ్స్ కామెరూన్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలెట్స్. "నభూతోనభవిష్యత్" అనిపించేలా రూపొందిన ఈ సినిమా ఓ సాంకేతిక అద్భుతం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. రికార్డు స్థాయిలో 400 మిలియన్ డాలర్ల వ్యయం తో రూపొందిన ఈ సినిమా విడుదలయిన తొలి వారంలోనే సినిమా వ్యయాన్ని రాబట్టి లాభాలను ఆర్జించే స్థాయికి చేరడం విశేషం. విడుదలయిన రెండు వారాల్లోనూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తొలి స్థానంలో నిలిచి, పది రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 615 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.
దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ నమోదు కాని ఓ అరుదైన రికార్డును సృష్టించే అవకాశం వుంది. మొత్తంగా ఈ సినిమా వసూళ్లు మిలియన్ డాలర్లను దాటే అవకాశం వుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అదే కానీ జరిగితే మిలియన్ డాలర్లను వసూలు చేసిన సినిమా గా ఈ సినిమా చరిత్ర సృష్టించనుంది. ఇంతకు ముందు ఇదే ఏడాది విడుదలయిన హ్యారీ పోటర్ : ది హాఫ్ బ్లడ్ ప్రిన్స్ సినిమా మొత్తంగా 930 మిలియన్ డాలర్లను వసూలు చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా చరిత్ర సృష్టించింది.
రికార్డులతో పాటు ఈ సినిమా అవార్డుల పంట కూడా పండించనుందనే అభిప్రాయం హాలీవుడ్ లో వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాది జరిగే 2009 అకాడమీ అవార్డుల్లో ఈ సినిమా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే తో పాటు సాంకేతిక విభాగంలో రికార్డులను కైవసం చేసుకుంటుదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











