ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన జేమ్స్ కామెరూన్ 'అవతార్'

By Staff

ఇంత వరకూ కేవలం సాధించిన రికార్డులతోనే వార్తల్లో నిలిచిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా తాజాగా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. నిన్న చైనా లో అవతార్ జాతివివక్ష ఆరోపణలు, రెచ్చగొట్టే విధంగా వుందన్న ఆరోపణలతో నిషేధానికి గురికాగా నేడు ఏకంగా ఓ మనిషి ప్రాణాలనే బలికొని వార్తల్లో నిలిచింది. తైవాన్ కు చెందిన 42 ఏళ్ల కౌ అనే వ్యక్తి అవతార్ సినిమాను 3-డి లో చూసి తీవ్ర ఉత్కంఠకు గురై రక్తపోటుతో మరణించాడని అక్కడి వైధ్యులు చెప్పారట.

నూతన సంవత్సర వేడుకలు తన కుటుంబంతో కలసి ఎంతో సంతోషంగా జరుపుకొన్న ఆయన ఆ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా అవతార్ ను 3-డి వర్షన్ లో చూసాడు. ఆ తర్వాత ఆయన హైపర్ టెన్షన్ కు గురై స్పృహ కోల్పోయిన స్థితోలో నాన్ మెన్ జనరల్ ఆసుపత్రిలో చేరాడు. అతని మెదడులో రక్తస్రావం జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. సినిమా చూస్తూ తీవ్ర ఉద్వేగానికి, ఉత్కంఠకు లోను కావడం వల్లనే అలా జరిగి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అతను సినిమా చూసిన 11 రోజుల తర్వాత మరణించాడు. సినిమా చూడడం వల్ల తలనొప్పులు, చూపు మందగించడం వంటి వికారాలు పుడుతున్నాయని ఫిల్మ్‌ బ్లాగింగ్‌ సైట్స్‌ల్లో ఫిర్యాదులు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X