Avatar: Fire and Ash: అవతార్ 3 మూవీలో చార్లి చాప్లిన్ మనవరాలు విలన్ పాత్రలో.. అడ్వాన్స్ బుకింగ్ క్రేజీగా..
ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ డైరెక్షన్‌లో రూపొందిన అవతార్: ఫైర్ అండ్ యాష్. అవతార్ సినిమా సీక్వెల్‌లో మూడో చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరాన్, జాన్ లండావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సామ్ వర్తింగ్డన్, జో సల్దానా, సిజర్నీ వీవర్, స్టీఫాన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్, ఊనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు.
అవతార్3 సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫిని, సైమన్ ఫ్రాంగ్‌లెన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు స్టీఫెన్ రివికిన్, డెవిడ్ బ్రెన్నెర్, జాన్ రిఫ్యూ, జేమ్స్ కామెరాన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.అవతార్: ఫైర్ అండ్ యాష్ సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో డిసెంబర్ 1వ తేదీన ప్రదర్శించారు. 400 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాల వివరాల్లోకి వెళితే..

అవతార్ సినిమా కథ విషయానికి వస్తే.. జేక్, నేతిరి తమ కుమారుడు నెతేయమ్ మరణంతో భాధపడుతున్న సమయంలో పండోరా గ్రహంలోకి మెట్‌కాయినా అనే తెగ వస్తుంది. నేవీ తెగకు వారితో సవాల్ ఎదురవుతుంది. యాష్ పీపుల్ అనే పేరున్న ఈ తెగకు, నేవీ తెగకు జరిగిన పోరాటం ఏమిటి? పండోరా గ్రహంలో చోటు చేసుకొన్న ప్రతికూల పరిస్థితులు ఏమిటి? వాటిని జేక్, నేతిరి ఎలా ఎదురించారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
ఈ చిత్రం ద్వారా దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్ మనవరాలు సినీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఫైర్ క్లాన్ లీడర్‌గా ఊనా చాప్లిన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు. దాంతో ఈ సినిమాపైతోపాటు ఆమె పాత్రపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
తన పాత్ర గురించి ఊనా చాప్లిన్ మాట్లాడుతూ.. నన్ను నేనుగా ఎప్పుడూ విలన్‌గా చూసుకోలేదు. అలాగని నన్ను విలన్‌గా కూడా చూడవద్దు. కాకపోతే ఈ సినిమాలో వారంగ్ అనే నా పాత్ర కాంప్లికేట్‌గా ఉంటుంది. నా పాత్రలో కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. వారంగ్‌గా నెగిటివ్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తాను అని అన్నారు.
ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఐమాక్స్ వెర్షన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ డిసెంబర్ 5వ తేదీ నుంచి మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











