జాతివివిక్ష వివాదంలో చిక్కుకున్న 'అవతార్'..!!

By Kuladeep

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సాంకేతిక మాయాజాలం 'అవతార్'. మూడు వారాల క్రితం విడుదలయిన ఈ సినిమా ప్రస్తుతం హాలీవుడ్ లోనే కాదు ప్రపంచం మొత్తం హాట్ టాపిక్. ప్రపంచ సినీ చరిత్రలో రెండవ అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇంత వరకూ సాధించిన రికార్డులతోనే వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓ వివాదంతో వార్తల్లో నిలవడం గమనార్హం. ఈ వివాదం వర్ణ వివక్షను రెచ్చగొట్టే విధంగా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పాండోరా గ్రహంలోని నావీ అనే జీవుల నివాస స్థలాన్ని నాశనం చేసేందుకు తెల్లజాతీయులయిన వారు ప్రయత్నించడం, ఈ బృందంతో పాండోరాకు వెళ్లి అవతార్ గా బ్రీడ్ చెయ్యబడ్డ కథానాయకుడు జాక్ సుల్లీ ఆ తర్వాత నావీలలో కలసిపోయి వారి నివాస స్థలాన్ని రక్షించుకోలేక నిస్సహాయ స్థితిలో వున్న నావీలకు సాయపడి వారిని రక్షించడం ఇదీ అవతార్ సినిమా కథ క్లుప్తంగా. ఇంతకీ ఇందులో వివాదానికి తావిచ్చే అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారా..!! పాండోరా లోని నావీలు నీలం రంగులో వుండటమే ఈ వివాదానికి కారణం. నల్లజాతీయులను ఈ సినిమాలో నిస్సహాయులుగా చూపించారని, వారికి నావీగా బ్రీడ్ చెయ్యబడ్డ ఓ తెల్లజాతీయుడు సాయం చేస్తేకానీ తమను తాము రక్షించుకోలేక పోయారనే విధంగా సినిమాలో చూపించారని వివాదాన్ని లేవనెత్తిన వారు ఆరోపిస్తున్నారు.

దీనికి తోడు సినిమాలో నావీగా నటించిన ప్రధాన నటులు, కథానాయిక జియో సల్దానా నల్లజాతీయురాలు కావడం, కథానాయకుడు శ్యామ్ వర్తింగ్టన్ ఓ తెల్లజాతీయుడు కావడం లాంటివి ఈ వివాదాన్ని మరింత జఠిలం చేసాయని చెప్పవచ్చు. కానీ ఈ వివాదాన్ని అవతార్ సినిమా దర్శకుడు, నిర్మాత జేమ్స్ కామెరూన్ తేలికగా కొట్టిపారేసారు. సినిమా కలెక్షన్లను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడే వివాదాలు ఈ సినిమా కలెక్షన్లు పెంచడంలో కూడా ఉపయోగపడితే ప్రస్తుతానికి 1.3 బిలియనా డాలర్లను వసూలు చేసి ప్రపంచ సినీ చరిత్రలో రెండవ అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మొదటి స్థానంలో ఉన్న టైటానికి సినిమా వసూళ్లను అధికమించి ప్రథమ స్థానంలో నిలిచేందుకు మరెంతో సమయం పట్టదు....!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X