twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అవతార్' సినిమానా..ఆ అదేమీ అంత గొప్ప సినిమా కాదు..!!

    By Kuladeep
    |

    ఆ సినిమా ఉత్తమ సినిమా కాదు కానీ, ఈ ఏడాది గుర్తుంచుకోదగ్గ సంఘటనల్లో ఈ సినిమా ఒకటి. అదేంటి ఉత్తమ సినిమా కాకపోతే ఈ సినిమాను ఎందుకు గుర్తుంచుకోతగ్గదిగా ఎంపిక చేసారు..?? అనే అనుమానం వస్తోందా..?? అయితే ఈ ప్రశ్నకు జవాబు మా దగ్గర లేదు కానీ అమెరికన్ ఫిల్మ్ ఇస్టిట్యూట్ వారినే అడగాలి. ఇంతకీ ఏంటా సినిమా కమామీషు అనుకుంటున్నారా...?? మరేం లేదండీ ఈ సంవత్సరాంతం లో విడుదలయిన 3-డి మాయాజాలం 'అవతార్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయఢంకా మోగించి రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ పాతదే అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు, అద్భుతమయిన గ్రాఫిక్ మాయాజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తోంది. దీంతో ఈ సినిమా ఈ సంవత్సరానికి గాను అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది.

    కాగా అమెరికన్ ఫిల్మ్ ఇస్టిట్యూట్ 2009వ సంవత్సరానికి కాగా ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాల్లో అవతార్ సినిమాకు స్థానం దొరుకుతుందనే అందరి అంచనాలనూ తలకిందుల చేస్తూ ఈ సినిమాను వారు ఉత్తమ చిత్రంగా గుర్తించలేదు. కానీ ఈ ఏడాది గుర్తుంచుకోదగ్గ సంఘటనల్లో అవతార్ సినిమా విడుదలను ఓ సుమధుర ఘట్టంగా అభివర్ణించింది. ఉత్తమ సినిమాల జాబితాలో అంతగా ప్రేక్షకాదరణను నోచుకోని 'ఎ సీరియస్ మ్యాన్', 'ది హర్ట్ లాకర్', 'ప్రీషియస్' సినిమాలు చోటు సంపాదించుకోవడం గమనార్హం. ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ హఠాన్మరణం కూడా ఈ ఏడాది గుర్తుంచుకో తగ్గ సంఘటనల్లో చోటు సంపాదించుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X