twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెల్యులాయిడ్ పై మరో అద్భుత సృష్టి 'అవతార్'

    By Kuladeep
    |

    హాలీవుడ్ లో 'టైటానిక్' వంటి అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ కమెరాన్ తాజా దర్శకత్వం వహించిన చిత్రం అవతార్. ఫిక్షన్ కథతో రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 18న విడుదల అవ్వడానికి సిద్ధం అవుతోంది. కథ విషయానికి వస్తే జాక్ అనే ఓ నావికుడు ఓ పోరాటంలో గాయపడి నడవలేని స్థితిలో వుంటాడు. తాను నడవడానికి అవకాశం వుంటుందని తెలిసి అవతార్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి పాండార్ అనే ఓ అడవికి చేరతాడు. పాండార్ నావీ అనే ఏలియన్ ను పోలిన వింత జీవులు నివాస స్థలం కూడా. పది అడుగుల ఎత్తు, ఓ తోక, నీలం రంగులో మెరిసే చర్మంతో వీరంతా వింతగా వుంటారు. తమ నివాస స్థలాన్ని మనుషులు ఆక్రమించుకుంటున్నారని వారు పోరాటం మొదలు పెడతారు. ఈ పోరాటంలో జాక్ కూడా పాలుపంచుకోవాల్సి వస్తుంది. అంతే కాకుండా జాక్ ఓ నావీని ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుంతో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 3-D పరిజ్ఞానంతో రూపొందిన ఈ సినిమా కోసం హాలీవుడ్ మొత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X