twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెండి తెర అద్భుతం 'అవతార్' రికార్డుల వెళ్లువ..!!

    By Kuladeep
    |

    జేమ్స్ కామెరూ్న్ దర్శకత్వం వహించిన 3-డి మాయాజాలం అవతార్ సినిమా విడుదలయిన మొదటి రోజు నుండీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తూనే వుంది. తాజా ఈ సినిమా రికార్డుల వెళ్లువలో మరో రికార్డు వచ్చి చేరింది. అది ప్రపంచంలో ఇప్పటి వరకూ భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో రెండవ స్థానాన్ని పొందడం. ఇంతకు ముందు 1.12 బిలియన్ డాలర్ల వసూళ్లతో 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్' సినిమా పేరిట వున్న ఈ రికార్డును నిన్నటి వరకూ జరిగిన 1.14 బిలియన్ డాలర్ల వసూల్లతో అవతార్ సినిమా బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఆ తర్వాతి స్థానంలో 1.1 బిలీయన్ డాలర్ల వసూళ్లతో 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: డెడ్ మ్యాన్స్ చెస్ట్' సినిమా నిలిచింది.

    కాగా ఈ జాబితాలో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలోనే వచ్చిన 'టైటానిక్' సినిమా 1.842 బిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగు వారాల పాటు బాక్సాఫీసు వద్ద తొలిస్థానాన్ని నిలబెట్టుకుంటున్న అవతార్ సినిమా టైటానికి సినిమా రికార్డులను బ్రేక్ చేసి ఈ జాబితాలో కూడా ప్రథమ స్థానంలో నిలవాలని ఆశిద్దాం...!!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X