For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అధ్యక్షులవారిని మెప్పిన 'అవతార్' సినిమా అరుదైన రికార్డు..!!

    By Kuladeep
    |

    జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్' అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు, మిలియన్ డాలర్లు పైచిలుకు వసూళ్లు రాబట్టి మిలియన్ డాలర్ల క్లబ్ లో చోటుసంపాదించుకున్న 'టైటానిక్', 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్', 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: డెడ్ మ్యాన్స్ చెస్ట్' ల సరసన చోటు సంపాదించుకుంది. విడుదలయి ఇప్పటికి మూడు వారాలయిన ఈ సినిమా 1.02 మిలియన్ డాలర్లను వసూళు చేసి మిలియన్ డాలర్ సినిమాల క్లబ్ లో చోటు సంపాదించుకుంది.

    విడుదలయిన మూడు వారాల పాటు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ పొజీషన్ నిలిచి మొత్తంగా 1.02 మిలియన్ డాలర్ల పైచిలుకు వసూళ్లు రాబట్టింది ఈ 3-డీ సినిమా. ఈ సినిమాను పంపిణీ చేసిన 20th సెంచురీ ఫాక్స్ సినిమాస్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ సినిమా వసూళ్లు ఏ మాత్రం తగ్గట్లేదు సరికదా.. పెరుగుతూనే వున్నాయి. గత వారాతంలో ఈ సినిమా మొత్తంగా 202 మిలియన్ డాలర్లు వసూలు చేసి వరుసగా మూడో సారి బాక్సాఫీసు వద్ద టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో షెర్లాక్ హాల్మస్ చిత్రం నిలిచింది. ఈ సినిమా 38.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

    కాగా ఇటీవలే ఈ సినిమాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన కుటుంబ సభ్యలు, స్నేహితులతో కలసి చూసారు. వీరి కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేసారు. ఈ సినిమా అధ్యక్షలవారికి తెగ నచ్చేసిందట.. ఇంకా ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలకొట్టనుందో, ఎన్ని రికార్డులను సృష్టించనుందో అని హాలీవుడ్ విశ్లేషకులు ఆశక్తిగా గమనిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X