ముస్తాబవుతున్న అవతార్ సీక్వెల్... 2022 ఆఖరికి కనులవిందే

అవతార్ పేరు వింటేనే సినీ ప్రియులు, ముఖ్యంగా హాలీవుడ్ ఫ్యాంటసీ సినిమాలు ఇష్టపడే వారు మైమరిచిపోతారు. గ్రహాంతర వాసులంటూ ఉంటే ఇలానే ఉంటారా అన్నంతగా కళ్లకు కట్టినట్లు సజీవంగా చూపిన విలక్షణ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తాజాగా తన విజువల్ వండర్ కు సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నాడు.

ఎప్పుడో పట్టాలెక్కిన అవతార్ సీక్వెల్ అసలుకు 2021 డిసెంబర్ లోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ, లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడటంతో విడుదల తేదీ 2022కు వెళ్లిపోయింది. అయినప్పటికీ జనాల్లో సినిమా పట్ల ఆసక్తి ఇసుమంతైనా తరగలేదు.

Avatar Sequel in December 2022

ఇటీవలే చిత్రీకరణ పునః ప్రారంభం అవ్వడంతో ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. సైన్స్ ఫిక్షన్ రాణిగా పేరుగాంచిన సిగోర్నీ వీవర్ ఆధ్వర్యం అండర్ వాటర్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి దృష్టిలో పెట్టుకుని చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు రిలీజ్ చేయగా అవి నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోయాయి.

అండర్ వాటర్ సీక్వెన్స్ చిత్రీకరణను స్వయంగా పరిశీలిస్తున్న వీవర్ వర్క్ డెడికేషన్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. 70ఏళ్ల సిగోర్నీ వీవర్ ధైర్య సాహసాలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు వీవర్ ఎలాంటి స్టంట్లు చేసేందుకు వెనుకాడరని, అండర్ వాటర్ లోనైనా సరే వెనక్కు తగ్గరని ట్యాగ్ చేశారు. న్యూజిల్యాండ్ లో ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X