'అవతార్' లో వేడిపుట్టించే సెక్స్ సీన్ చూడాలనుకుంటున్నారా...!!

By Kuladeep

'అవతార్' సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఎంత కష్టపడి రూపొందించారో ఇప్పుడా కష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి కూడా అంతే చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. సుమారు 400 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా విడుదలయిన మూడు వారాల్లోనే 1.02 బిలియన్ డాలర్లను వసూలు చేసి బిలియన్ డాలర్ల క్లబ్ లో చోటు సంపాదించుకుంది. చరిత్రలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో నాల్గవ స్థానంలో నిలిచింది. ఇటీవలే ఈ సినిమా గురించి మాట్లాడిన కామెరూన్ ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన వుందని, కానీ దానికంటే ముందు ఈ సినిమాకు మేము పడ్డ కష్టాన్ని సొమ్ముచేసుకోనీయండి అని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆ సొమ్ము చేసుకొనే కార్యక్రమానికే నాంది పలికాడు కామెరూన్. అవతార్ సినిమాకు వచ్చిన లాభాలకు తోడు ఈ సినిమా డివిడి అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించాలనుకున్న కామెరూన్ ఓ పథకం రచించాడు. అవతార్ సినిమాలో కట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను డివిడి లలో నిక్షిప్తం చేసి విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇందులో అవతార్ గా మారిన హీరో శ్యామ్ వర్తింగ్టన్ మరియు ఆడ నావీ నెయిత్రి (జో సల్దనా) ల మధ్య వచ్చే ఓ సెక్స్ సీన్ కూడా ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ నావీల మధ్య శృంగారం ఎలా వుండనుందో తెలుసుకోవాలంటే మీరు డివిడి విడుదలయ్యే వరకూ ఎదురుచూడాల్సిందే అని ఆశక్తిని రేపుతున్నారు. మంచి ప్లానే కాదా...!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X