రికార్డు స్థాయి కలెక్షన్లతో అదరగొడుతున్న 'అవతార్'

By Kuladeep

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్' అందరూ అనుకున్నట్టుగానే వెండి తెర మీద ఓ అద్భుత లోకాన్ని ఆవిష్కరించింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులని 160 నిమిషాల పాటు ఓ అద్భుతమయిన వింత లోకంలో విహరింపజేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. గత శుక్రవారం (డిసెంబరు 18వ తేదీ) విడుదలయిన ఈ చిత్రం ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 232.18 మిలియన్ డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

దక్షిణ అమెరికాలో అధిక మంచు వర్షం వల్ల ఈ వారాంత సినిమా కలెక్షన్లు 50% వరకూ పడిపోయినా ఇక్కడ 73 మిలియన్ డాలర్లను వసూలు చేసి తన సత్తాను చాటుకుంది. 250 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే సినిమా పెట్టుబడిని రాబట్టి లాభాలను ఆర్జించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఇక భారతదేశంలో కూడా ఈ సినిమా కనక వర్షాన్ని కురిపిస్తోంది. ఇక్కడ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ హాలీవుడ్ సినిమా తొలి రోజే 6.75 కోట్లరూపాయలను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో కి అనువాదమయిన ఈ చిత్రం ప్రాంతీయ చిత్రాలను సైతం అధికమించి మంచి కలెక్షన్లను రాబడుతోందని సమాచారం.

ఇక సినిమా విషయానికి వస్తే టైటానిక్ సినిమాలో వున్న ఫీల్ ఈ సినిమాలో మిస్ అయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నా కళ్లు చెదిరే గ్రాఫిక్స్, పాండోర్ అనే వింత లోకం, నావీ అనే 10 అడుగుల వింత జీవి విన్యాసాలు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చుని సినిమాను చూసే విధంగా చేసాయి. ఇక ఈ సినిమా రాబోయే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డుల్లో అవార్డుల పంట పండించుకుంటుందని అప్పుడే అంచనాలు మొదలైపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X