'అవతార్' ను మక్కీకి మక్కీ కాపీ చేసారు..!!
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత మాయాజాలం 'అవతార్'. ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన మూడు వారాల్లోనే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ సినిమాగా రికార్డు సృష్టించిన ఈ సినిమా కథ, గతంలో వచ్చిన ఓ కార్టూన్ సినిమాను పోలివుంది. 'థుంబలీనా' పేరుతో వచ్చిన ఈ సినిమా ప్రముఖ బార్బీ చిత్రాలలో ఒకటిగా గత సంవత్సరం మార్చి 17న విడుదలయింది.
ఇక ఈ సినిమా కథను ఓ సారి విశ్లేషిస్తే "థుంబలీనా అనే ఓ అమ్మాయి తమ వారందరితో కలసి అడవిలోని ఓ చెట్టు పొదల్లో నివసిస్తూ వుంటుంది. అక్కడి చెట్లకు, జీవులకు అరుదైన శక్తులు వుంటాయి. సజావుగా గడచిపోతున్న వారి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తూ అక్కడో ఫ్యాక్టరీని నిర్మించాలని ఓ పారిశ్రామిక వేత్త వస్తాడు. థుంబలీనా పరిణామంలో చిన్నగా వుండటంలో వారిని ఎదుర్కోవడానికి కష్టపడుతూ వుంటుంది. అప్పటికీ వారికున్న శక్తులతో అడ్డుకోజూసినా మనుషుల పరిజ్ఞానం ముందు అవి నిలువలేవు. దాంతో థుంబలీనా సదురు పారిశ్రామిక వేత్త కుమార్తెను తన శక్తులతో ఆకర్షించి తన స్నేహితురాలిని చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ప్రకృతి యొక్క విలువను తెలియజెప్పి, తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు ఆపాలని ఆ అమ్మాయి తన తండ్రిని కోరుతుంది. ఆమె ముందు సరేనన్న ఆమె తండ్రి తిరిగి ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత థుంబలీనా, పారిశ్రామిక వేత్త కూతిరి సాయంతో ఎలా ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంది అనేది మిగితా కథ".
ఇక అవతార్ సినిమా కథను ఓ సారి గమనిస్తే "ఇందులో కూడా పాండోరా అనే గ్రహంలోని విలువైన ఖనిజసంపదను సొంతం చేసుకోవాలని నావీ అనే జీవుల నివాస స్థలాన్ని నాశనం చెయ్యాలని మనుషులు భావిస్తారు. ఇందులో భాగంగా అక్కడికి వెళ్లిన కథానాయకుడు, అక్కడి ఆడ నావీ నెయిత్రి ద్వారా ప్రకృతి విలువను తెలుసుకొని ఆ తర్వాత మారిపోయి వారికి జరుగుతున్న అన్యాయాన్ని గమనించి వారితి ఎలా సాయం చేసి వారి నివాస స్థలాన్ని కాపాడాడు అనేది మిగిలిన కథ".
రెండు కథలనూ పరికించి చూస్తే రెండింటిలోనూ ప్రకృతి యొక్క గొప్పదనాన్ని చెప్పారు. రెండింటిలోనూ మానవుల అధునాతన ఆయుధాలను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారు. ఆ తర్వాత నాశనం చెయ్యడానికి వచ్చిన వారిలోని ఒకరే వీరికి సాయపడతారు. మరిలాంటి కథలు భారతీయులకు కొత్తేం కాదు. ఇదే కథగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అవతార్ సినిమాలో ఉపయోగించిన అద్భుత గ్రాఫిక్స్ సినిమాను ఉత్తమ సినిమాను చెయ్యడంలో ఉపయోగపడ్డాయి. వీటి ముందు కథలోని లోపాలు కనిపించకుండా పోయాయి. అరె ఈ కథను ఇంతకు ముందెన్నడో చూసామే అనిపించినా అద్భుత గ్రాఫిక్ మాయాజాలం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











