Avatar 2 Trailer Review: కళ్లు చెదిరే టెక్నాలజీతో.. విజువల్ వండర్ అనేంతగా అవతార్ 2 ట్రైలర్
లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించిన చిత్రం అవతార్: ది వే ఆఫ్ వాటర్. 2009లో వచ్చిన అవతార్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను 2020లో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను డిసెంబర్ 16 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అవతార్ 2 సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

అండర్ వాటర్‌లో షూట్
అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీని అండర్ వాటర్‌లో ఫెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా చిత్రీకరించారు. ఈ సినిమా కోసం నటీనటులను, సాంకేతిక నిపుణులను అండర్ వాటర్‌లో ఉండేలా రెండేళ్లపాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సినిమాను అమెరికాలోని కాలిఫోర్నియాలో మాన్‌హాట్టన్ బీచ్‌లో చిత్రీకరణను మొదలుపెట్టారు.

నా కుటుంబాన్ని రక్షించుకొంటాను..
అవతార్ 2 సినిమా రిలీజ్‌కు ప్రమోషన్‌లో భాగంగా నవంబర్ 22వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో.. మా వద్దకు నీవు ఎందుకు వచ్చావు అంటూ టోనోవరి ప్రశ్నిస్తే.. నా ఫ్యామిలీ రక్షించుకోవడానికి అంటూ జేక్ సల్లీ సమాధానం ఇచ్చారు. ఇక ఇక్కడ బతకాలంటే.. రైడింగ్ నేర్చుకోవాల్సిందే.. మాతో సమానంగా జీవించాలంటే.. మా అలవాట్లను ఒంటపట్టించుకోవాల్సిందే అంటూ హుకుం జారీ చేయడం.. ఆ తర్వాత అండర్ వాటర్‌లో విచిత్రమైన జంతువులపై రైడింగ్ చేయడం కనిపించింది. నా ప్రజల రక్షించుకోవాలంటే.. నేను కూడా ఫైట్ చేస్తాను అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపించాయి.

మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫి అద్బుతంగా కనిపించింది. అండర్ వాటర్‌లో చిత్రీకరించిన సీన్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి. పైమాన్ ఫ్రాంగ్లేన్ మ్యూజిక్ చాలా బాగుంది. సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిందనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది.

సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్
అవతార్ 2 సినిమాను 250 మిలియన్ డాలర్ల వ్యయంతో 2041 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అవతార్ 2 సీక్వెల్ తర్వాత అవతార్ 3 2024 డిసెంబర్ 20న, అవతార్ 4 డిసెంబర్ 18, 2026న, అవతార్ 5 డిసెంబర్ 22, 2028 తేదీన రిలీజ్‌కు సిద్ధం చేశారు. సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం అవతార్ అనే విషయం సంచలనంగా మారింది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ తదితరులు
స్క్రీన్ల్ ప్లే, దర్శకత్వం: జేమ్స్ కామెరాన్
కథ: జేమ్స్ కామెరాన్, రిక్ జాఫా, అమండా సిల్వర్, జోష్ ఫ్రైడ్‌మ్యాన్, షేన్ సలెమో
నిర్మాతలు: జేమ్స్ కామెరాన్, జాన్ లాండు
సినిమాటోగ్రఫి: రస్సెల్ కార్పెంటర్
ఎడిటింగ్: జేమ్స్ కామెరాన్, స్టీఫెన్ రివ్కిన్, డేవిడ్ బ్రెన్నర్
మ్యూజిక్: సైమన్ ఫ్రాంగ్టెన్
బ్యానర్: లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2022-12-16


Click it and Unblock the Notifications











