రజనీకాంత్ మూవీ స్పూర్తిగా ‘అవెంజర్స్’ క్లైమాక్స్ తీశారట!
మార్వెల్ సంస్థ నుంచి వచ్చే మూవీస్ అంటే ఇష్టపడే ప్రేక్షకులు త్వరలో రాబోతున్న 'అవెంజర్స్ : ఎండ్‌గేమ్' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ విడుదలకు కొన్ని వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స వేగం పెంచారు. ఈ చిత్ర దర్శకుల్లో ఒరైన జో రుస్సో ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తూ... రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవన్స్, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్‌వర్త్, స్కార్కెట్ జాన్సన్ నటించిన ఈ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు.
తాజాగా జో రుస్సో ఇండియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను 2015లో తీసిన 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్' మూవీ క్లైమాక్స్‌లో ఓ సీన్ రజనీకాంత్-ఐశ్వర్యరాయ్ నటించిన 'రోబో' సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయి తీసినట్లు వెల్లడించారు.

తనకు బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా తెలుసని జో రుస్సో తెలిపారు. నేను యాక్షన్ డైరెక్టర్. కొన్నేళ్ల క్రితం దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలు చూశాను. ఈ చిత్రాల్లో కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. హీరోలో ఎనర్జీ లెవల్స్ చూపించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుంది. అలా నాకు సల్మాన్ ఖాన్ తెలుసు అని జో రుస్సో చెప్పుకొచ్చారు.
మార్వెస్ స్టూడియోస్ వారు నిర్మించిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' చిత్రానికి ఆంటోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 26, 2019న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











