అవెంజర్స్: ఎండ్ గేమ్ సంచలనం... హాట్ కేకుల్లా 10 లక్షల టికెట్లు.. సెకన్‌కు ఎన్ని అమ్ముడుపోయాయంటే!

Recommended Video

Avengers: Endgame Sells 1 Million Tickets In A Day || Filmibeat Telugu

భారీ అంచనాల మధ్య విడుదల కానున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం రిలీజ్‌కు భారత్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమా కోసం మార్వెల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వ్యవహారం భారతీయ సినిమా పరిశ్రమలోనే ఓ రికార్డుగా మారే అవకాశం కనిపిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో బాక్సాఫీస్ వద్ద అవెంజర్స్ సృష్టించిన హల్‌చల్ ఇదే..

అవెంజర్స్‌ కోసం పోటెత్తిన ఫ్యాన్స్

అవెంజర్స్‌ కోసం పోటెత్తిన ఫ్యాన్స్

అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగానే సినీ అభిమానులు పోటెత్తారు. మొదటి రోజే 10 లక్షల సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమా టికెట్లకు కనిపిస్తున్న డిమాండ్ చూస్తే రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు.

సెకన్‌కు 18 టికెట్ల చొప్పున

సెకన్‌కు 18 టికెట్ల చొప్పున

సినిమా టికెట్ల అమ్మకాలు సాగించే బుక్ మై షో నిర్వాహకులు తెలిపిన ప్రకారం.. ప్రతీ సెకన్‌కు 18 టికెట్ల చొప్పున బుక్ అయ్యాయి. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏప్రిల్ 26న రిలీజ్ అవుతున్నది. ఢిల్లీ, ముంబైలో ఈ సినిమాకు అత్యంత ప్రేక్షకాదరణ కనిపిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 కనివినీ ఎరుగని అనూహ్య స్పందన

కనివినీ ఎరుగని అనూహ్య స్పందన

అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాకు వస్తున్న రెస్సాన్స్‌పై ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ స్పందించారు. కనీవిని ఎరుగని రితీలో అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాకు స్పందన వస్తున్నది. టికెట్ల అమ్మకాలు ఊహించని విధంగా ఉంది. భారీ బడ్జెట్ హిందీ సినిమాల కంటే ఎక్కువగా రెస్పాన్స్ కనిపిస్తున్నది. భారత్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం. బాక్సాఫీస్ రికార్డులకు తుప్పు వదలడం ఖాయం. రికార్డుల పరంపరకు సిద్దంకండి అంటూ తరణ్ ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 1000 స్కీన్లలో

దేశవ్యాప్తంగా 100 నగరాల్లో 1000 స్కీన్లలో

అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం దేశంలోని 100 నగరాల్లో 1000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శింపబడనున్నది. తొలి మూడు రోజులకే రూ.2.25 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. వారాంతానికి దాదాపు 74 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఎక్కువగా ఢిల్లీ, నోయిడా, ముంబై నగరాల్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది అని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

 మార్వెల్ నుంచి 22వ సినిమా

మార్వెల్ నుంచి 22వ సినిమా

అవెంజెర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో సూపర్ విలన్ థానోస్ చేసే చారిత్రాత్మక పోరాటంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికాతో థానోస్ తలపడే పోరాటాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే 22వ సినిమా. గత నెల కెప్టెన్ మార్వెల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X