For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైరసీ కోరల్లో అవెంజర్స్‌: ఎండ్‌గేమ్.. తమిళ రాకర్స్ దుశ్చర్య.. వెబ్‌సైట్‌లో రెండు రోజుల ముందే లీక్

|

దేశీయ సినిమాలకే కాకుండా హాలీవుడ్ సినిమాలకు పైరసీ వెబ్‌సైట్స్ తమిళ్ రాకర్స్ చుక్కలు చూపిస్తున్నది. గత కొద్దికాలంగా సినిమాలను యదేచ్ఛగా పైరసీ చేస్తూ సవాల్ విసురుతున్న తమిళ రాకర్స్ హాలీవుడ్‌ నిర్మాతలకు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అవెంజర్స్‌ సినిమాను లీక్ ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

మార్వెల్ సీక్వెల్స్‌లో చివరి చిత్రంగా

మార్వెల్ సీక్వెల్స్‌లో చివరి చిత్రంగా

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ రూపొందించిన మార్వెల్ చివరి సీక్వెల్ అవెంజర్స్: ఎండ్ గేమ్ కావడంతో ప్రేక్షకులకు అత్యంత ఆసక్తిని రేపింది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్న థానోస్ ఆటలను సూపర్ హీరోలు ఎలా కట్టించారనే కథగా ఈ చిత్రం రూపొందింది. చివరి చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోవడంతో తమిళ రాకర్స్ తమ ప్రతాపాన్ని చూపింది.

తమిళ్ రాకర్స్ లీక్

తమిళ్ రాకర్స్ లీక్

టికెట్ల కోసం తంటాలపడుతున్న ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తమిళరాకర్స్ దుశ్చర్యకు పాల్పడింది. వెబ్‌సైట్‌లో అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని రెండు రోజుల ముందే లీక్ చేసింది. కెమెరా ప్రింట్‌ను వెబ్‌సైట్లో పెట్టి డౌన్‌లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చింది. అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో మంగళవారం జరిగిన ప్రీమియర్స్ నుంచి పైరసీ చేసినట్టు భావిస్తున్నారు. తమిళ్ రాకర్స్ లీక్ వ్యవహారం తాజాగా మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భారీ వసూళ్లకు గండి

భారీ వసూళ్లకు గండి

అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం దేశవ్యాప్తంగా తొలి రోజు రూ.50 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో వారాంతంలో వసూళ్లలో గండిపడే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చిత్రాన్ని 24 గంటలపాటు వారం రోజులు ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.

అమెరికాలో ప్రీమియర్ షో

అమెరికాలో ప్రీమియర్ షో

అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో మంగళవారం అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని ప్రీమియర్ షోగా ప్రదర్శించారు. హలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాకు పొటేత్తారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించారు.

English summary
The much-awaited Avengers: Endgame has become the latest victim of piracy. According to reports, infamous piracy website TamilRockers has leaked a cam print of the entire film online two days before its release. The film stars Robert Downey Jr, Chris Evans, Chris Hemsworth, Mark Ruffalo, Paul Rudd and Brie Larson, among others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more