‘అవెంజర్స్-ది ఎండ్‌గేమ్’ చూసి ఎమోషనల్... ఐమాక్స్ వద్ద ఏడ్చేసిన ఫ్యాన్స్!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ 'అవెంజర్స్-ది ఎండ్‌గేమ్' మూవీ చూసిన తర్వాత ఎమోషనల్ అవుతున్నారు. ఎంతో సంతోషంగా సినిమా చూడటానికి వచ్చిన వారంతా షో పూర్తయ్యాక బరువెక్కిన హృదయాలతో తిరిగి వెళుతున్నారు. మరికొందరైతే థియేటర్లోనే కన్నీటి పర్యంతం అవుతున్నారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ వద్ద ఓ అభిమాని మాట్లాడుతూ... 'అవెంజర్స్-ఎండ్‌గేమ్' మూవీ చాలా ఎమోషనల్‌గా ఉంది. మార్వెల్ అభిమానులు గుండె ధైర్యం చేసుకుని రావాలి. క్లైమాక్స్‌లో 10 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నాకు ఏడుపు ఆగడం లేదు. మార్వెల్ ఫ్యాన్స్ అంతా గుండె నిబ్బరం చేసుకుని రండి.' అని తెలిపారు.

అంచనాలను మించిన సినిమా, ఎండ్ లెస్ ఎమోషన్
‘‘ఇదొక ఎపిక్ మూవీ... రేటింగ్ ఇవ్వడం సాధ్యం కాదు. కొంతమంది సినిమాను ముందే లీక్ చేశారు. కానీ ఈ మూవీ థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఉంటుంది. మార్వెల్ సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ మూవీ లేనంత గొప్పగా ఉంది. అంచనాలు పెట్టుకుని రావొద్దు. ఇది అంచనాలను మించిన సినిమా, ఎండ్ లెస్ ఎమోషన్. '' అని మరొక్ అభిమాని పేర్కొన్నారు.

ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం
‘‘మార్వెల్ సినిమాలకు కనెక్ట్ అయ్యే వారికి ఈ సినిమాలోని ప్రతీ సీనూ ఒక డైమండ్ లాగే ఉంటుంది. క్లైమాక్స్ ఏమిటనేది చెప్పటం కన్నా చూస్తేనే బావుంటుంది. సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేశాయి. ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఫస్టాఫ్ ఎంత కామెడీగా ఉందో... సెకండాఫ్ అంత ఎమోషనల్‌గా ఉంది.'' అని అభిమానులు పేర్కొంటున్నారు.

చివరగా వచ్చే వార్ సీన్ మైండ్ బ్లోయింగ్
‘అవెంజర్స్-ది ఎండ్‌గేమ్' సూపర్ మూవీ. చివరగా వచ్చే వార్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా గురించి ఎక్కువ చెబితే స్పాయిల్ అవుతుంది. థియేటర్లోనే చూడండి. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5/5 మార్కులు వేయొచ్చు.' అంటూ ఓ లేడీ అభిమాని చెప్పుకొచ్చారు.

సినిమా చూసి మా బాబు చాలా ఫీలయ్యాడు
‘సినిమా చాలా బావుంది. కానీ ఐరన్ మ్యాన్ లాస్ అయిపోయాం. క్లైమాక్స్‌లో ఐరన్ మ్యాన్‌ను చంపేశారు. మా బాబు చాలా ఫీలయ్యాడు. ఇక అవెంజర్స్ సిరీస్ సినిమాలు రావని చాలా బాధపడుతున్నాడు. సినిమా ఇంత ఎమోషనల్‌గా ఉంటుందనుకోలేదు. '' తన కుమారుడితో సినిమా చూసేందుకు వచ్చిన ఒక లేడీ పేర్కొన్నారు.

లైట్ ఆగిపోయిన తర్వాత అందరూ ఏడుస్తారు
‘‘సినిమా సెకండాఫ్ పీక్స్. ఇప్పటి వరకు ఏ సినిమాలో రాని విధంగా యాక్షన్ సీన్లు ఉన్నాయి. మూవీలో లైట్ ఆగిపోయిన తర్వాత అందరూ ఏడుస్తారు. ఇప్పటి వరకు వచ్చిన అవెంజర్స్ సినిమాలన్నీ చూశాను. అన్నింటికంటే ఇది ది బెస్ట్ మూవీ. ఈ సినిమాతో అవెంజర్స్ ఎండ్ అవుతుంది'' అంటూ మరొక అభిమాని బాధను వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











