‘అవెంజర్స్’ ప్రకంపనలు.. 24x7 ప్రదర్శనలు.. 4DX వెర్షన్లలో కూడా.. బాక్సాఫీస్‌పై థానోస్ దాడి
Recommended Video
హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఎండ్‌గేమ్ విడుదలకు ముందే భారత్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ స్టేజ్‌లోనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. వారానికి ముందే దేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున్న టికెట్లు అమ్ముడుపోవడం సినీ వర్గాలను, ట్రేడ్ పండితులను షాక్ గురిచేస్తున్నది. అయితే అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే...

అవెంజర్స్: ఎండ్‌గేమ్ 24x7
సినిమా ప్రదర్శన విషయంలో దేశంలోనే అవెంజర్స్ చిత్రం రికార్డును సొంతం చేసుకోబోతున్నది. తొలిసారి ఈ చిత్రాన్ని 24 గంటలు అలా వారం రోజుల పాటు ప్రదర్శించబోతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మిడ్‌నైట్, స్పెషల్ మార్నింగ్ షోలను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ముంబైలో ప్రత్యేక అనుమతులు
ముంబైలో అడ్వాన్స్ బుకింగ్‌కు సంబంధించి కొత్త స్లాట్‌ను ఓపెన్ చేశారు. కార్నివాల్ ఐమాక్స్ వాడాలా (ముంబై) అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని ఉదయం 3.20 గంటల షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం అనుమతులు కూడా తీసుకొన్నట్టు తెలుస్తున్నది. మిడ్‌నైట్ తర్వాత స్పెషల్ షోను ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని ముంబై థియేటర్ ఓనర్లు వెల్లడించారు.

ఐమాక్స్, 4DX వెర్షన్లలో షోలు
అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచబోతున్నది. ఈ చిత్రాన్ని ఐమాక్స్, 4డీఎక్స్ వెర్షన్లలో ప్రదర్శించనున్నారు. భారత్‌లోని పలు నగరాల్లో ఈ టెక్నాలజీని కొన్ని థియేటర్లు సమకూర్చుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్సాహంతో ఎదురుచూస్తుండటంతో ఈ మేరకు సాంకేతిక మార్పులు థియేటర్లలో చోటుచేసుకొంటున్నాయి.

మొదటి రోజే 10 లక్షల టికెట్లు హాంఫట్
అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగానే సినీ అభిమానులు పోటెత్తారు. మొదటి రోజే 10 లక్షల సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొదటి మూడు రోజులకే సుమారు 3 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. సినిమా టికెట్ల అమ్మకాలు సాగించే బుక్ మై షో నిర్వాహకులు తెలిపిన ప్రకారం.. ప్రతీ సెకన్‌కు 18 టికెట్ల చొప్పున బుక్ అయ్యాయి. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏప్రిల్ 26న రిలీజ్ అవుతున్నది.

సూపర్ విలన్ థానోస్ వర్సెస్ సూపర్ హీరోలు
అవెంజెర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో సూపర్ విలన్ థానోస్ చేసే చారిత్రాత్మక పోరాటంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికాతో థానోస్ తలపడే పోరాటాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే 22వ సినిమా. గత నెల కెప్టెన్ మార్వెల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది.


Click it and Unblock the Notifications











