twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డు స్థాయి స్క్రీన్లలో విడుదవుతున్న ‘అవేంజర్స్: ఇన్ఫినిటీ వార్’

    By Bojja Kumar
    |

    Recommended Video

    Avengers: Infinity War, Trailer Has Released

    ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, ఎక్స్‌మెన్ సినిమాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రఖ్యాత హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్. వీరందరినీ కలిపి ఒకే సినిమాలో చూపిస్తూ ఇప్పటికే 'అవేంజర్స్' సిరీస్‌లో పలు సూపర్ హీరో చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ సీరిస్ లో వస్తున్న మరో భారీ చిత్రం 'ఇన్ఫినిటీ వార్'. మార్వెల్ సంస్థ నుండి వచ్చిన సూపర్ హీరోలందరూ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

    ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలోనూ ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ చిత్రాన్ని భారత్ లో విడుదల చేస్తున్నారు. 2 వేలకు పైగా స్క్రీన్లలో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. మన దేశంలో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న తొలి హాలీవుడ్ మూవీ ఇది.

    Avengers: Infinity War released in over 2000 screens across India

    ఇండియాలో ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మెట్రో నగరాలతో పాటు టౌన్ స్థాయి థియేటర్లలో కూడా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది, టికెట్స్ అన్నీహాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

    ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా 175 నుండి 200 మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తుందని హాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్లో విలన్ పాత్రకు రానా డబ్బింగ్‌ చెబుతుండటం గమనార్హం.

    ఆంటోనీ రూస్సో, జో రూస్సోలు ఈ సినిమాకు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మార్వెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై కెవిన్‌ ఫీజ్‌ నిర్మిస్తున్నారు. జూనియర్‌ రాబర్ట్‌ డౌనీ, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జోష్‌ బ్రోలిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

    English summary
    Avengers: Infinity War is going to set a new record for any Hollywood film ever released in India. The film is being released in over 2,000 screens across India and this is a never before feat. Apart from the IMAX 3D, digital 3D and 2D formats for the English version, the film will also release in Hindi, Telugu and Tamil in 3D and 2D formats.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X