Don't Miss!
- News
తెలంగాణ అసెంబ్లీలో 3న గవర్నర్ ప్రసంగం: బడ్జెట్ 6న, కీలక పరిణామాలు
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అభిమానిపై రేప్.. ప్రముఖ సింగర్‌పై కేసు.. అసలేం జరిగిందంటే?
అమెరికన్ సింగర్, బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ బ్యాండ్ సభ్యుడు నిక్ కార్టర్‌పై రేప్ ఆరోపణలు రావడం హాలీవుడ్‌లో సంచలన రేపింది. 2001 సంవత్సరంలో అభిమానిపై జరిగిన అత్యాచారం ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే నిక్ కార్టర్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన తరుఫు న్యాయవాది మైఖేల్ హోల్ట్స్ తోసిపుచ్చారు. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆరోపణలు అసత్యం, అందులో వాస్తవం లేదు అని ఆయన చెప్పారు. ఆ కేసు వివరాల్లోకి వెళితే..
నిక్ కార్టర్‌పై వచ్చిన ఆరోపణలపై న్యాయవాది స్పందిస్తూ.. నా క్లయింట్‌ను టార్గెట్ చేస్తూ తప్పుడు ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసు నమోదైనప్పటి నుంచి రకరకాలుగా ఆరోపణలు మార్చారు. రకరకాలుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇలాంటి చవకబారు ఆరోపణలతో మీడియాను, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించలేరు. కాబట్టి ఈ కేసులో ఆరోపణలపై కోర్టు తీర్పు ఇవ్వనున్నది అని అన్నారు.

నిక్ కార్టర్‌పై నమోదైన కేసు గురించి వివరణ ఇస్తూ.. 17 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిపై లైంగిక దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు మీడియా ముందుకు వచ్చి.. కంటతడి పెడుతూ చేతుల జోడించి.. న్యాయం చేయాలని వేడుకొన్నది. నా జీవితం దారుణంగా దెబ్బ తీశాడు. నాపై రేప్ చేసిన తర్వాత వేశ్య అంటూ నన్ను భూతులు తిట్టాడు. నా చేతిని ఒడిపెట్టి తిప్పాడు. నన్ను బలవంతంగా లాక్కొని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. నిక్ కార్టర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసింది.
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. ఓ సంగీత వేడుక జరిగిన తర్వాత నన్ను ఆయన ప్రయాణించే బస్సులో పిలిచాడు. ఆ తర్వాత ఎరుపు రంగు డ్రింక్ నాతో తాగించాడు. కాన్ బెర్రి జ్యూస్‌లో మద్యం కలిపి ఇచ్చాడని తర్వాత తెలిసింది. ఆ తర్వాత నేను మత్తులోకి జారిన తర్వాత నాపై అఘాయిత్యం జరిపారు అని ఫిర్యాదు చేసింది.