BAFTA Awards 2024: ఒక్క సినిమాకే 7 అవార్డులు.. ఆ చిన్న మూవీ ఖాతాలో ఐదు
ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించి ఎన్నో రకాల అవార్డులు ఉన్నాయి. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రత్యేకంగా చూస్తుంటారు. అలాంటి వాటిలో బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్) ఒకటి. వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లకు ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటారు. తాజాగా ఈ వేడుక తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. వీటిలో పలు చిత్రాలు హవాను చూపించి ఎన్నో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో విజేతల పూర్తి వివరాలను మీరే చూడండి!
వరల్డ్ వైడ్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే 'బాఫ్టా' అవార్డుల కార్యక్రమం ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో హాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. అలాగే, దీపికా పదుకొణే కూడా హాజరైంది.

77వ బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి సెన్సేషన్ అయిన 'ఓపెన్‌హైమర్' మూవీ సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. అందులో ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్ కేటగిరిల్లో దీనికి అవార్డులు దక్కాయి.
'ఓపెన్‌హైమర్' తర్వాత 'పూర్ థింగ్స్' సినిమా కూడా హవాను చూపించింది. ఈ చిత్రం కూడా ఐదు విభాగాల్లో అవార్డులు అందుకుంది. అందులో ఉత్తమ నటి, ఉత్తమ మేకప్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్స్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగాలు ఉన్నాయి.
బాఫ్టా అవార్డులు విజేతలు
బెస్ట్ మూవీ - ఓపెన్‌హైమర్
బెస్ట్ యాక్టర్ - సిలియన్ ముర్ఫీ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ యాక్ట్రెస్ - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ డైరెక్టర్ - క్రిస్టఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ స్క్రీన్ ప్లే - జస్టిన్ ట్రియెట్ & ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ యానిమేషన్ మూవీ - ది బాయ్ అండ్ ది హెరాన్
ఉత్తమ సినిమాటోగ్రఫీ - హాట్ వాన్ హోటిమా (ఓపెన్‌హైమర్)
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ ఔట్ స్టాండింగ్ బ్రిటీష్ ఫిల్మ్ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ కాస్టింగ్ - ది హోల్డోవర్స్
బెస్ట్ ఎడిటింగ్ - జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ మేకప్ - నాడియా స్టాసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - సైమన్ హ్యూస్
బెస్ట్ సౌండ్ - జానీ బర్న్, టార్న్ విల్లర్స్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
బెస్ట్ డాక్యుమెంటరీ - మారియుపోల్‌లో 20 రోజులు
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - పూర్ థింగ్స్
బెస్ట్ కాస్టూమ్ డిజైన్ - పూర్ థింగ్స్
స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ - పూర్ థింగ్స్


Click it and Unblock the Notifications











