జానీ డెప్ కు వృత్తి సాఫల్యత అవార్డు... !!
ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ కు ఇటీవలి కాలంతో పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవలే హాలీవుడ్ లో కెల్లా అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకుడిగా రికార్డు సృష్టించిన జానీ, ఆ తర్వాత అమెరికాలోని ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన సర్వేలో రెండవ సారి ప్రపంచంలో కెల్లా సెక్సీయెస్ట్ నటుడిగా నిలిచాడు. బ్రాడ్ పిట్ తర్వాత ఈ ఘనతను రెండు సార్లు సాధించిన ఏకైక హీరోగా రికార్డులకు ఎక్కాడు.
ప్రస్తుతం 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సీక్వెల్ సినిమాలోనూ, 'ది టూరిస్ట్' అనే సినిమాలో ఏంజలీనా జోలీకి జతగా నటిస్తున్న జానీకి వృత్తి సాఫల్యత (కెరీర్ టైం అచీవ్ మెంట్) అవార్డు వరించిందట. బహమాస్ అంతర్జాతీయ సినీ వారోత్సవాల్లో జాకీ ఈ అవార్డు ప్రధానం చెయ్యనున్నట్టు విశ్వసనీయ సమాచారం. డిసెంబరు 10 నుండీ 17 వరతూ 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి హాలీవుడ్ అతిరథమహారథులంతా తరలివస్తారు. సినీ పరిశ్రమకు జానీ సేవలను పురస్కరించుకొని ఆయనకీ అవార్డును ప్రధానం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











