twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాన్ చేసిన పోస్టర్స్ఇవే (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    న్యూయార్క్: ఓ చిత్రం తెరకెక్కి, ప్రేక్షకాదరణ నోచుకునే ముందు మేకర్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాలవిన్యాసాలు చేస్తూంటారు. ముఖ్యంగా వారి దృష్టి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, ప్రోమో మీదే ఉంటుంది. ఇటువంటి జాగ్రత్తల విషయాల్లో హాలీవుడ్ మనకన్నా ముందు ఉంటూ వస్తోంది. అయితే హాలీవుడ్ లోనూ మనకన్నా స్ట్రాంగ్ గా సెన్సార్ ఉంది. విచ్చిలివిడితనం తగ్గించటానికి అక్కడ సెన్సార్ పోస్టర్స్ సైతం బ్యాన్ చేస్తూ వస్తోంది.

    అయితే ఆ బ్యాన్ చేసిన పోస్టర్స్ రిలీజ్ కు ముందు ప్రమోషన్ కోసం బయిటకు రాకపోయినా తర్వాత అఫీషియల్ గా(ఐమ్ బిడీ సైతం ప్రచురించింది) అనీఫిషియల్ గానూ మన ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే చిత్రం ఏమిటంటే...కొన్ని పోస్టర్ బ్యాన్ కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. అప్పటి కాల మాన పరిస్ధితులను బట్టి బ్యాన్ చేసినవి తర్వాత మళ్లీ విడుదల కూడా చేయటం జరిగింది.

    ఇవి సినిమా అభిమానులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. వెబ్ లో ఈ తరహా స్టఫ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద స్టూడియోల సినిమాల పోస్టర్స్ సైతం ఇలా బ్యాన్ చేయబడ్డాయి. వాటిలో కొన్ని...ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈ పోస్టర్స్ అన్నీ వెబ్ లో దొరికేవే కావటం విశేషం.

    ఇటలీలో...

    ఇటలీలో...

    ఈ పోస్టర్ ఇప్పుడు సినీ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎల్ రోత్ కొత్త సినిమా క్లౌన్ పోస్టర్ అయిన దీన్ని ఇటలీలో బ్యాన్ చేసారు.

    రూల్స్ ఆఫ్ ఎట్రాక్షన్

    రూల్స్ ఆఫ్ ఎట్రాక్షన్

    జంతువల బొమ్మలతో ఇలాంటి సెక్సువల్ గ్రాఫిక్స్ చేయటం పద్దతి కాదంటూ ఈ పోస్టర్ ని నిషేధించారు.

    ధర్ట్స్

    ధర్ట్స్

    ఈ చిత్రానికి సంభందించిన ఈ పోస్టర్...సెక్స్ ప్లే లేదా చావుకు సంభందించిందా క్లారిటీ లేదంటూ...నిషేధించారు.

    షేమ్..

    షేమ్..

    ఈ పోస్టర్ చాలా వల్గర్ గా ఉందంటూ చిన్న పిల్లల చూడటానికి చాలా ఇబ్బంది పడతారంటూ బ్యాన్ చేసారు.

    సా II

    సా II

    సా చిత్రం సీరిస్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్ 2 లోని హర్రర్ పోస్టర్ ని నిషేథించారు. మితిమీరిన హింసను రిప్రెజెంట్ చేస్తోందంటూ ఈ పోస్టర్ ని బ్యాన్ చేసారు.

    ద గర్ల్ విత్ ద డ్రాగన్ టట్టూ

    ద గర్ల్ విత్ ద డ్రాగన్ టట్టూ

    ఈ చిత్రం రిలీజైనప్పుడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అస్కార్ కి సైతం వెళ్లింది. ఈ పోస్టర్ లో అసభ్యత ఉందంటూ బ్యాన్ చేసారు.

    జాక్ అండ్ మిరీ మేక్ ఎ ప్రోమో..

    జాక్ అండ్ మిరీ మేక్ ఎ ప్రోమో..

    తమ సినిమా కాన్సెప్టు మొత్తాన్ని పోస్టర్ లో రిప్రెజెంట్ చేసామంటూ నిర్మాతలు చెప్పే ఈ పోస్టర్ వేరే అర్దాలను ఇస్తోందంటూ బ్యాన్ చేసారు.

    సిన్ సిటీ 2

    సిన్ సిటీ 2

    ఈ పోస్టర్ చాలా హాట్ గా ఉందని, నిబంధలను దాటి ఈ పోస్టర్ లో శృంగారం, అర్ద నగ్నత ప్రతిఫలిస్తోందంటూ బ్యాన్ చేసారు.

    ది పీపుల్ వెర్సస్ లారీ ప్లింట్

    ది పీపుల్ వెర్సస్ లారీ ప్లింట్

    ఈ పోస్టర్ సైతం సభ్య సమాజం హర్షించని స్ధాయిలో డిజైన్ చేసారని బ్యాన్ చేసారు. ఈ పోస్టర్ ఆపారని కొంత వివాదం కూడా నడించింది.

     టీత్

    టీత్

    ఈ పోస్టర్ పిల్లలను కన్ఫూజ్ చేస్తుందని, వారు చాలా ఇబ్బందిగా ఫీలవతున్నారని ఈ పోస్టర్ ని బ్యాన్ చేయమంది.

    English summary
    MPAA or another ratings board has put the ban on a poster, frequently. We revisited the cases of ten banned movie posters so you can be the judge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X