twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ బరిలో ఒబామా దంపతులు.. నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న మూవీ

    |

    అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఈసారి రాజకీయపరంగా కాకుండా వినోద రంగం వార్తతో మీడియాలో కనిపించడం విశేషంగా మారింది. ఒబామా దంపతులు తీసిన ఓ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అవుతుందనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది. ఒబామా దంపతులు తీసిన ఆ చిత్రంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యేంత ఎలాంటి విశేషాలు ఉన్నాయంటే.

    అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్

    అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్

    ఒబామా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఈసారి రాజకీయపరంగా కాకుండా వినోద రంగం వార్తతో మీడియాలో కనిపించడం విశేషంగా మారింది. ఒబామా దంపతులు తీసిన ఓ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అవుతుందనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా మారింది. ఒబామా దంపతులు తీసిన ఆ చిత్రంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యేంత ఎలాంటి విశేషాలు ఉన్నాయంటే..

    అమెరికన్ ఫ్యాక్టరీ గురించి

    అమెరికన్ ఫ్యాక్టరీ గురించి

    అమెరికాలోని ఓహియో నగరంలో చైనాకు చెందిన సంపన్న పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసిన గ్యాస్ ఫ్యాక్టరీ గురించి అమెరికన్ ఫ్యాక్టరీ అనే డాక్యుమెంటరీని ఒబామా దంపతులు రూపొందించారు. కొద్ది రోజుల క్రితం సెండెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన ప్రీమియర్‌కు అద్భుతమై రివ్యూలు వచ్చాయి. దాంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.

    నెట్‌ఫ్లిక్స్ చేతికి ఒబామా డాక్యుమెంటరీ

    నెట్‌ఫ్లిక్స్ చేతికి ఒబామా డాక్యుమెంటరీ

    ఇలా ప్రజాదరణ పొందిన అమెరికన్ ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ పంపిణీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. మిచెల్ ఒబామా నిర్మాతగా మారిన ఈ డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యం కావడం హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గతనెల నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీని అందుబాటులోకి తీసుకురాగానే ఎక్కువ మంది వీక్షించడం జరిగింది.

    క్రిటిక్స్ ఆకాశానికెత్తేయడంతో

    క్రిటిక్స్ ఆకాశానికెత్తేయడంతో

    అమెరికన్ ఫ్యాక్టరీ డాక్యుమెంటరీని క్రిటిక్స్ ఆకాశానికెత్తేయడంతో ఇంకా ప్రజాదరణ పెరిగింది. చైనా, అమెరికా కార్మికుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరుకు ఈ డాక్యుమెంటరీ కనువిప్పు అని క్రిటిక్స్ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను చక్కగా, సమయానుకులంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించారని క్రిటిక్స్ తమ రివ్యూలో పేర్కొన్నారు.

    నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందం

    నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందం

    గతేడాది అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సంచలన నిర్ణయం తీసుకొన్నారు. టెలివిజన్ షోలు, డాక్యుమెంటరీలు భారీ స్థాయిలో రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకొన్నారు. ప్రస్తుతం ప్రముఖ రచయిత మైఖేల్ లెవిస్ రచించిన ది ఫిఫ్త్ రిస్క్ అనే పుస్తకానికి తెర రూపం కల్పించే పనిలో బిజీగా ఉన్నారు. ఇది బానిస సంకెళ్లకు వ్యతిరేకంగా పోరాడిన అమెరికా సామాజికవేత్త ఫ్రెడ్రిక్ డగ్లస్ జీవిత కథ కావడం గమనార్హం.

    నెట్‌ఫ్లిక్స్‌లో ప్రజాదరణ పొందుతున్న డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రజాదరణ పొందుతున్న డాక్యుమెంటరీ ఇదే

    నెట్‌ఫ్లిక్స్‌లో ప్రజాదరణ పొందుతున్న డాక్యుమెంటరీ ఇదే

    English summary
    American former president Barack and Michelle Obama again in news. But not for political, Its for Entertainment industry. Their documentary American Factory is expected to be nominated for the Academy Award for best documentary in February, next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X