twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత అవతారం ఎత్తిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా!

    By Bojja Kumar
    |

    అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అతడి భార్య మిచెల్లె ఒబామా కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించే వ్యాపారంలోకి ఎంటరయ్యారు. ఈ మేరకు సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన వీరు ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

    హైయర్ గ్రౌండ్ ప్రొడక్షన్ సంస్థపై ఒబామా దంపతులు స్క్రిప్టెడ్, అన్ స్క్రిప్టెడ్ సీరీస్‌, డ్యాక్యుమెంటరీస్, పీచర్ ఫిల్మ్స్ నిర్మించబోతున్నారు. ఏదో డబ్బులు పెట్టుబడిగా పెట్టి కూర్చోవడం కాకుండా నేరుగా ప్రొడక్షన్ వ్యవహారాల్లోకి ఎంటరైన అన్నీ దగ్గరుండి చూసుకోవాలని ఒబామా దంపతులు నిర్ణయించుకున్నారట.

    Barack Obama and his wife deal with Netflix Inc

    అయితే ఈ డీల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ డీల్ విలువ ఎంత? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే వీరు నిర్మించే తొలి షో... మే 2019లో ఆడియన్స్ ముందుకు వస్తుందని ఒబామా ప్రతినిధులు తెలిపారు.

    నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఒబామా దంపతులు ఈ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారనే విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

    ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. భవిష్యత్తులో నెట్‌ఫ్లిక్స్ లాంటి ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థల వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వస్తున్నారు. భారీ లాభాలు వచ్చే వ్యాపారం కావడం వల్లనే ఒబామా దంపతులు ఇటు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

    English summary
    Former U.S. President Barack Obama and his wife, Michelle Obama, have struck a deal to produce films and series for Netflix Inc, the streaming service said on Monday, Under the name Higher Ground Productions, the Obamas have the option to produce scripted and unscripted series, documentaries and feature films, Netflix said in a statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X