గ్రామీ అవార్డులలో చిందేయడానికి ఓకే అన్న మ్యాజిక్ లెజెండ్
ఎనిమిది సార్లు గ్రామీ అవార్డు అందుకున్న మ్యూజిక్ లెజెండ్ బార్‌బ్రా స్ట్రెయిశాండ్ ఈ ఆదివారం జరగనున్న గ్రామీ అవార్డుల కార్యక్రమంలో తన పెర్ఫార్మెన్స్ చేయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. సాధారణంగా బార్‌బ్రా స్ట్రెయిశాండ్ ఇలాంటి కార్యక్రమాలలో షోను ప్రదర్శించడం చాలా అరుదు. తన యాభై సంవత్సరాల కెరియర్‌లో సుమారుగా ఇలాంటి పెర్ఫార్మెన్స్‌లు మహా ఐతే నాలుగు సార్లు ఇచ్చి ఉంటానని అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రామీ అవార్డులలో బార్‌బ్రా స్ట్రెయిశాండ్ తను కొత్తగా రూపోందించినటువంటి ఆల్బమ్ 'లవ్ ఈజ్ ద ఆన్సర్' ఈసారి బెస్ట్ ట్రెడిషనల్ పాప్ వోకల్ ఆల్బమ్‌గా నామినేషన్‌కు ఎంపిక అయింది. ఇది మాత్రమే కాకుండా బార్‌బ్రా స్ట్రెయిశాండ్‌ని ఈసారి గ్రామీ ఛారిటబుల్ పౌండేషన్ తరుపున ఘనంగా సన్మానించాలని వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇక గ్రామీ అవార్డుల ముగింపు రోజున మ్యూజిక్ లెజెండ్ బార్‌బ్రా స్ట్రెయిశాండ్‌తో పాటు టోని బెన్నట్ట్, స్టీవ్ వండర్ కలసి ఆడిపాడనున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా బార్‌బ్రా స్ట్రెయిశాండ్‌కు సంబంధించినటువంటి కొన్ని గ్రెటేస్ట్ హిట్స్ ప్రదర్శించనున్నారు.


Click it and Unblock the Notifications











