twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియురాలిపై కాల్పులు జరిపి.. తనకు తాను కాల్చుకొని నటుడి సుసైడ్

    |

    అమెరికన్ యాక్టర్ హ్యాగెన్ మిల్స్ దారుణానికి పాల్పడ్డారు. తన మాజీ ప్రేయసిపై కాల్పులుకు ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. యూఎస్‌లోని స్టేట్ ఆఫ్ కెంటకీలో ఈ ఘటన సంచలనం రేపింది. ఈ దారుణ ఘటన వెనుక కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. హ్యాగెన్ హిల్స్ ఇలా తీవ్రమైన దాడికి పాల్పడటానికి కారణమేమై ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

    ప్రియురాలిపై కాల్పులు

    ప్రియురాలిపై కాల్పులు

    తన ప్రేయసి ఎరికా ప్రైస్‌పై మంగళవారం కాల్పులు జరిపారు. పలుమార్లు ఆమె ఛాతిలోకి కాల్పులు జరిపి దారుణానికి పాల్పడ్డారు. ఆమెపై కాల్పులు జరిపిన తర్వాత తనకు తాను తుపాకితో కాల్చుకొన్నాడు. తలలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో రక్తం మడుగులో పడి మరణించాడు అని కెంటకీ పోలీసులు వెల్లడించారు.

    ప్రేయసి ఛాతిలోకి గుళ్ల వర్షం

    ప్రేయసి ఛాతిలోకి గుళ్ల వర్షం

    మిల్స్ చేతిలో పలుమార్లు కాల్పులకు గురైన ఎరికా ప్రైస్ పరిస్థితి విషమంగా ఉంది. తుపాకి కాల్పులతో శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. ఎరికాపై కాల్పులు జరిపిన సమయంలో నాలుగేళ్ల కూతురు కూడా సంఘటనా స్థలంలో ఉంది. ప్రస్తుతం ఎరికా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తన చేతిపై, ఛాతిపై తీవ్రమైన గాయాలు అయ్యాయని పోలీసులకు ఎరికా వెల్లడించింది.

    కూతురుకు, తల్లికి..

    కూతురుకు, తల్లికి..

    మిల్స్ కాల్పులు జరిపిన సమయంలో ఎరికా కూతురు, తల్లి కూడా అక్కడే ఉన్నారు. అదృష్టవశాత్తూ వారిద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వారిద్దరూ క్షేమంగానే ఉన్నారు. వారిద్దరి నుంచి దుర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని కెంటకీలోని మేఫీల్డ్ పోలీసులు సేకరిస్తున్నారు.

    Recommended Video

    Sri Reddy Marriage Followed By Rana And Mihika Bajaj, Sri Reddy comments Viral
    హ్యాగెన్ మిల్స్ కెరీర్

    హ్యాగెన్ మిల్స్ కెరీర్

    అమెరికాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన బాస్కెట్ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నారు. స్వీడిష్ డిక్స్, ఇన్ వాలంటరిలీ సింగిల్ లాంటి టీవీ సీరిస్‌లో నటించారు. అలాగే బోన్నీ అండ్ క్లైడ్: జస్టిఫైడ్ మూవీలోను, స్టార్‌లైట్ చిత్రంలోను నటించారు.

    English summary
    Baskets fame actor Hagen Mills no more. He fired on ex girl friend Eric Price and shot him self at gun point. This goes sensation in Kentucky state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X