'ది డార్క్ నైట్ రైజెస్' అనే పేరుతో బ్యాట్ మెన్ మూడవ సీక్వెల్..!
2005సంవత్సరంలో వచ్చినటువంటి బ్యాట్ మెన్ చిత్రం ఎంతటి బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలుకొట్టిందో మన అందరికి తెలిసిందే. అలాంటి చిత్రాన్ని చాలా అత్యధ్బుతంగా యావత్ ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా తీర్చిదిద్దినటువంటి వార్నర్ బ్రదర్స్ సంస్ధ కు అందరం ముందుగా ధ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఈచిత్రానికి సీక్వెల్ గా2008సంవత్సరంలో ది డార్క్ నైట్ అనే పేరుతో మరోచిత్రం రావడం జరిగింది. ఈచిత్రం కూడా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కోట్టింది.
ఇక ముచ్చటగా మూడవ సారి ఈసినిమాకి మరో సీక్వెల్ తీయడానికి రంగం సిద్దం చేశారు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలెన్.. ఈసినిమాకి సంబంధించి 'ది డార్క్ నైట్ రైజెస్' అనే పేరుని ఖరారు చేశారు వార్నర్ బ్రదర్స్ సంస్ధ. ఇక ఈసినిమాని జులై 20,2012న ధియేటర్స్ లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం హాలీవుడ్ లోఅన్ని సినిమాలు కూడా 3డిలో వస్తున్నా ఈసినిమాని మాత్రం దర్శకుడు ఎందుకనో 3డిలో తీయడం లేదన్నారు.
ఈవిషయం పై స్పందించినటువంటి వార్నర్ బ్రదర్స్ సంస్ద డైరెక్టర్ తోఏకీభవించించడం జరిగిందన్నారు. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలెన్ మాట్లాడుతూ ఈసినిమా చూసిన తర్వాత అందరూ ఇక 3డి గురించి మరిచిపోతారని అన్నారు. ఈసినిమాలో అలాంటి టెక్నాలజీని ఉపయోగించామని అన్నారు.


Click it and Unblock the Notifications











