బ్యాట్‌మెన్ నటుడు కన్నుమూత.. పెను విషాదంలో హాలీవుడ్.. మృతికి కారణం అదే అంటూ!

హాలీవుడ్ సినిమా రంగంలో టాప్ గన్, బ్యాట్‌మెన్ ఫరెవర్ లాంటి చిత్రాల్లో అద్బుతమైన పాత్రలు పోషించిన యాక్టర్ వాల్ కిల్మర్ ఇకలేరు. వృద్దాప్య సంబంధింత, న్యూమోనియాతో బాధపడుతూ ఆయన మరణించారు. ఆయన మరణంతో హాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో మంచి నటుడిని కోల్పోయిందని పలువురు వ్యక్తిగతం, సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వాల్ కిల్మర్ గురించిన వివరాల్లోకి వెళితే..

వాల్ కిల్మర్ ఆరోగ్య పరిస్థితి కొద్ది సంవత్సరాలుగా క్షీణించింది. 2014లో ఆయన క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యారు. గొంతు క్యాన్సర్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొంటూ రికవరీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఆయన న్యుమోనియాకు గురయ్యారు. అయితే ఈ వ్యాధి లక్షణాల హాస్పిటల్ చేరిన ఆయన ఏప్రిల్ 1వ తేదీన మరణించారు అని ఆయన కూతురు అధికారికంగా ప్రకటించారు.

Batman and Top Gun fame Val Kilmer

కిల్మర్ వయసు 65 సంవత్సరాలు. ఆయన 1959 సంవత్సరంలో లాస్ ఎంజెలెస్‌లో జన్మించారు. ఆయనర నటి జోన్నే వాలేను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. విల్లో అనే సినిమా షూటింగులో పరిచమైన వాలెతో ప్రేమలో పడ్డారు. వారికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. మెర్సెడెజ్, జాక్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా జొన్నే వాలెతో విడాకులు తీసుకొన్నారు.

తొలుత ఆయన నాటక రంగంలో నిలదొక్కుకొన్నారు. ఆ తర్వాత ఆయన హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. టాప్ సీక్రెట్ అనే సినిమా ద్వారా ఆయన నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన కోల్డ్ వార్ సినిమా ద్వారా మరింత గుర్తింపును తెచ్చుకొన్నారు. మార్క్ ట్వెయిన్: సిటిజెన్ ట్వెయిన్ అనే నాటకంలో గుర్తుండిపోయేలా నటించారు.

వాల్ కిల్మర్ తన నట జీవితంలో ఐస్ మ్యాన్, ల్యారీ కింగ్, ది డోర్స్, టాంబ్ స్టోన్, హీట్, ది సెయింట్, బ్యాట్‌మెన్, టాప్ గన్ చిత్రాల్లో నటించారు. టాప్ గన్ మార్వెరిక్‌లో టామ్ క్రూయిజ్‌తో కలిసి నటించిన భావోద్వేగ సన్నివేశంలో ఆయన నటనతో ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేయడం విమర్శల ప్రశంసలందుకొన్నది.

బ్యాట్‌మెన్‌గా నటించిన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. టాప్ గన్, బ్యాట్‌మెన్ సినిమాల్లో నటన ద్వారా ఆయన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Read more about: batman top gun Val Kilmer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X