ఏప్రిల్ 13న విడుదలకు సిద్దమైన 'బ్యాటిల్‌షిప్'
ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రనిర్మాణ సంస్థ యూనివర్శల్ పిక్చర్స్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'బ్యాటిల్‌షిప్' అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి దర్శకుడు పీటర్‌బర్గ్. అత్యంత భారీ వ్యయంతో... అత్యున్నత సాంకేతిక పరిజ్జానంతో అడ్వెంచరస్ యాక్షన్, సైన్స్‌ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ అధినేత మాట్లాడుతూ -''భూమండలాన్ని ఆక్రమించుకోవడానికి గ్రహాంతరవాసులు మానవులపై జరిపే సముద్ర యుద్ధమే ఈ చిత్ర కథాంశంగా సాగుతుందని అన్నారు. సృష్టి అంతం అనేది ఈ సముద్ర యుద్ధంతోనే మొదలవుతుందా అనే ఉత్కంఠ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. మా సంస్థలో గతంలో వచ్చిన '2012 యుగాంతం' కంటే సాంకేతికంగా ఎన్నో రెట్లు ఈ సినిమా ఉంటుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఉత్కంఠకు లోను చేస్తుంది. అమెరికా కంటే నెలరోజుల ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు.
నావికాదళ యుద్ధం గేమ్స్ వ్యాయామం పై ఒక గ్రహాంతర ఆర్మడ ద్వారా వచ్చిన యుద్ద నౌకలపై విజయం ఎలా సాధించాయనే ముఖ్య కథాంశంతో సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో లీడ్ రోల్‌ని నైమ్ లీసాన్ పోషించనున్నాడు. 24 సంవత్సరాల వయసు కలిగిన సింగర్ రిహానా తన ఫెర్పామెన్స్ ద్వారా నిర్మాతలను, దర్శకులను ఒప్పించడమే కాకుండా, ఆమె నటనతో వారిని కట్టిపడేసినట్లు సమాచారం. దర్శకుడు పీటర్ బెర్గ్ మాట్లాడుతూ రిహానా పాత్ర చాలా సహాజంగా ఉంటుంది. ఈ సినిమాలో రిహానా పాత్ర జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ పాత్ర మాదిరి ఉంటుంది. ఈ సినిమాలో నటన ద్వారా రిహానాకు మరిన్ని సినిమాలో నటించే అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











