'ప్లానెట్ పై సెక్సియస్ట్ మ్యాన్' గా సాకర్ వీరుడు...?
2012వ సంవత్సరానికి గాను 'ప్లానెట్ పై సెక్సియస్ట్ మ్యాన్' అవార్డుని సాకర్ ఆటగాడు ఫ్యాషన్ ఐకాన్ 'డేవిడ్ బెకహాం' సొంతం చేసుకున్నారు. 36 సంవత్సరాల వయసు కలిగిన డేవిడ్ బెకహాంకి ఈ టైటిల్‌ని హీట్ మ్యాగజైన్ ఇచ్చింది. ప్రపంచం మొత్తం మీద 101 మంది హాటెస్ట్ సెలబ్రిటీలను సెలక్ట్ చేయగా.. వారిలో మొట్టమొదటి స్దానాన్ని డేవిడ్ బెకహాం సొంతం చేసుకున్నారు.
'ప్లానెట్ పై సెక్సియస్ట్ మ్యాన్' అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ సూపర్ స్టార్స్ రేయన్ గోస్లింగ్, రేయన్ రేనాల్డ్స్, బ్రాడ్రీ కూపర్ మొదలగున వారు ఉన్నారు. వీరందిరిలో మొదటి స్దానాన్ని డేవిడ్ బెకహాం సొంతం చేసుకోగా.. రెండు, మూడు స్దానాల్లో రేయన్ గోస్లింగ్, రేయన్ రేనాల్డ్స్ నిలిచారు. ఇక హీట్ మ్యాగజైన్ విషయానికి వస్తే ప్రతి వారం కూడా హాటెస్ట్ సెలబ్రిటీలను ప్రచురించే మ్యాగజైన్ అని తెలిపారు. కానీ మొట్టమొదటి సారి ప్రపంచం మొత్తం మీద ఉన్న సెలబ్రిటీలలో 'ప్లానెట్ పై సెక్సియస్ట్ మ్యాన్' అవార్డుని ప్రకటించామని అన్నారు.
ఈ అవార్డుని సెలబ్రిటీల టాలెంట్, సెక్స్ అప్పీల్, డ్రస్ సెన్స్, పర్సనాలిటీ ఆధారంగా ప్రకటించామని హీట్ మ్యాగజైన్ ఎడిటర్ లూసీ కేవ్ స్పష్టం చేశారు. 'ప్లానెట్ పై సెక్సియస్ట్ మ్యాన్' టాప్ లిస్ట్‌లో ఉన్న మిగతా సెలబ్రిటీలు వరుసగా...
* డేవిడ్ బెకహాం
* ర్యాన్ గోస్లింగ్
* ర్యాన్ రేనాల్డ్స్
* బ్రాడ్లీ కూపర్
* రాబర్ట్ ప్యాటిన్సన్
* టామ్ హార్డీ
* జానీ డెప్
* జాక్ ఎఫ్రాన్


Click it and Unblock the Notifications











