ఆ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు..!
సిడ్ని: నా జీవితంలో నేను మరచిపోలేని రోజు నా పాపకు జన్మనిచ్చిన రోజు. ఇప్పుడు నాకు ప్రపంచం అంతా నా పాపే. జీవితంలో నేను ఇచ్చే మొట్టమొదటి ప్రయారిటి నా పాప మరియు నా భర్త ఆండర్సన్ కి మాత్రమే అని అంటోంది రెసిడెంట్ ఈవిల్ హీరోయిన్ మిల్లా జోవోవిచ్. ఒక తల్లిగా నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రస్తుతం నా ధ్యాసంతా నా పాపపై ఉంది. ఇటీవల నా పాపకి కోంచెం సిక్ అయింది. దానితో నాకు కాళ్శు చేతులు ఆడలేదు, తన పరిస్దితి మామూలుగా అయ్యేంత వరకు. ప్రస్తుతం నా వయసు 34 సంవత్సరాలు, నేను కూడా నాపాపతో గేమ్స్ ఆడుకుంటున్నాను. దానికి కారణం దెయ్యాల సినిమాలలో నటించి నేను కూడా అలసిపోయాను అందుకే నేను నా పాప తో కలసి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను.
ఇలా నేను నా పాపతో ఆడుకునేటప్పుడు నేను కూడా తనలాగే ప్రవర్తించాల్సి వస్తుంది. అంతేకాకుండా తన నిద్రపోయే తీరు నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు నాకు ఒక కొత్త సమస్య వచ్చిపడింది. అదేంటంటే ప్రేగ్నస్సీ సమయంలో నేను 32 కేజీలు పెరిగాను. మా పాప జన్మించిన తర్వాత కష్టపడి 4.5 కేజీలు తగ్గాను. మా పాప నా కడుపులో ఉన్నప్పుడు 90 కేజీలు ఉన్నానని, ఇప్పుడు 18 కేజీలు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుసు 40 సంవత్సరాల తర్వాత మనం చాలా కొత్తగా ఉంటామని, అయినా సరే ప్రస్తుతం నేను డైట్ ని సక్రమంగా తీసుకుంటున్నాను. పిజ్జాలు, కేక్స్ కి చాలా దూరంగా ఉంటున్నానని అన్నారు. రాబోయే ఎనిమిది నెలలో నేను ఇంకా వెయిట్ తగ్గుతానని అన్నారు.


Click it and Unblock the Notifications











